టాలీవుడ్ హీరోయిన్లలో స్టైల్‌కు మారుపేరుగా చెప్పుకునే వారిలో అగ్రతార సమంత ముందు వరుసలో ఉంటారు. ఆమె ధరించే దుస్తులు, నగలు ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ తీసుకుంటాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతో పాటు స్టైల్‌తోనూ కోట్లాది మంది అభిమానులను ఆమె సొంతం చేసుకున్నారు. సినిమాల్లోనే కాదు బయట కూడా ఆమె అంతే స్టైలిష్‌గా ఉంటారు. డిజైనర్ వేర్ బట్టలు, నగలు, కూలింగ్ గ్లాసెస్ ధరిస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. వస్త్రధారణ, ఆభరణాల విషయంలో సింపుల్‌గా ఉంటూనే స్టైలిష్‌గా కనిపించేలా సామ్ జాగ్రత్త పడతారు. అలాంటి సమంత మరోమారు అందర్నీ మెస్మరైజ్ చేశారు. తాను నటిస్తున్న హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ప్రీమియర్‌లో ఆమె రూ.65 వేల ఖరీదు చేసే అద్భుతమైన విక్టోరియా బెక్‌హామ్ క్రోచెట్ ప్యాచ్‌వర్క్ స్కర్ట్ ధరించి కనిపించారు.
విక్టోరియా స్కర్ట్‌కు తగ్గట్లుగా బల్గారీ డైమండ్ జ్యువెల్లరీతో మెరిశారు సామ్. ఆమె మెడలో మిలమిలా మెరిసిపోతున్న స్నేక్ నెక్‌పీస్ ధర అక్షరాలా రూ.2.9 కోట్లు, చేతికి వేసుకున్న బ్రేస్లెట్ ధర రూ.2.6 కోట్లు అని సమాచారం. ‘సిటాడెల్’ ప్రీమియర్‌కు వచ్చిన సినీ సెలబ్రిటీలను సమంత తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ లుక్కు సంబంధించిన ఫొటోలను సామ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. సమంత వేసుకున్న జువెలరీ ధర తెలుసుకున్న నెటిజన్స్.. ఈ డబ్బులతో ఒక చిన్న బడ్జెట్ మూవీ తీసేయొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే, ‘సిటాడెల్’లో సామ్‌కు జోడీగా స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించారు. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కోసం వీళ్లిద్దరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘శాకుంతలం’ డిజాస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ‘సిటాడెల్’ సామ్ ముఖంలో సంతోషాన్ని నింపుతుందేమో చూడాలి.
#Samantha‘s diamond jewellery at #Citadel premiere in #London grabs eyeballs #Tollywood #TollywoodActor #SamanthaRuthPrabhu #VarunDhawanhttps://t.co/Pm8znqBIHW
— The Siasat Daily (@TheSiasatDaily) April 19, 2023