స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా స్పెషలే. ఆమెను సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. అలాంటి సామ్ తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫొటో హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ హీరోయిన్ సమంతకు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటున్న సామ్.. సేవా కార్యక్రమాలతోనూ తన వ్యక్తిత్వం ఎలాంటిదో చాటి చెబుతున్నారు. అందుకే ఆమెకు అంత క్రేజ్ ఉందని చెప్పొచ్చు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తిరుగులేని ఇమేజ్ను సొంతం చేసుకున్నారీ భామ. ఇటీవలే ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు సామ్. కానీ ఈ మూవీ ఆమె ఆశించినంత విజయం సాధించలేదు. ఈ ఫిల్మ్ తన 25 ఏళ్ల కెరీర్లో అతిపెద్ద జర్క్ ఇచ్చిందని నిర్మాత దిల్ రాజు అన్న విషయం విదితమే. ఇది పక్కనబెడితే.. తాను చేయాల్సిన మిగతా చిత్రాలపై ఫోకస్ పెడుతున్నారు సమంత. ఆమె ప్రస్తుతం ‘సిటాడెట్’ సిరీస్ హిందీ రీమేక్ చిత్రీకరణలో బిజీబిజీగా ఉన్నారు.
మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్.. నొప్పిని భరిస్తూనే ‘సిటాడెల్’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సిరీస్ కోసం ఆమె కఠినమైన స్టంట్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ‘సిటాడెల్’ సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంతతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నారు. ఈ సిరీస్ ఒరిజినల్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ యాక్ట్ చేశారు. ‘సిటాడెల్’ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సమంత.. ఈ సిరీస్ షూట్లో భాగంగా తన చేతులకు గాయాలైన ఫొటోలను అందరితో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర ఫొటోను ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఐస్ బాత్ టబ్‌లో ఆమె కూర్చున్నారు. ఈ ఫొటోకు ‘ఇది టార్చర్ సమయం’ అని క్యాప్షన్ జతచేశారు. సామ్ ఐస్ టబ్‌లో కూర్చున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఆమె ఐస్ బాత్‌లో ఉపశమనం పొందుతున్నట్లు తెలుస్తోంది.