అమ్మవారు, సాయిబాబా విగ్రహాల ముందు సమంత స్పెషల్ గా పూజ, ధ్యానం చేస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఓ సాధారణ నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ టైంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు వెబ్ సిరీసుల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వావ్ అనిపిస్తుంది. సినిమాల పరంగానే కాకుండా అప్పుడప్పుడు గుళ్లు, పూజలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా అలా ఓ ఫొటో పోస్ట్ చేసిన సమంత.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలేం జరిగింది?
ఇక విషయానికొస్తే.. హీరోయిన్ గా టాలీవుడ్ లో స్టార్ హోదా దక్కించుకున్న సమంత, హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ల మ్యారేజ్ హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నప్పటికీ.. సమంత హిందూ కల్చర్ ని మర్చిపోలేదు. తిరుపతితో పాటు పలు దేవాలయాలని కాలినడకన దర్శించుకోవడం లాంటివి చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే వచ్చింది. అయితే తాజాగా పోస్ట్ చేసిన పిక్ మాత్రం సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది.
ఎందుకంటే ఈ పిక్ లో అమ్మవారి ప్రతిమతో పాటు సాయిబాబా విగ్రహం ఎదురుగా సమంత ధ్యానం చేస్తున్నట్లు కనిపించింది. ‘కొన్నిసార్లు నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అదే మిమ్మల్ని ప్రశాంతంగానూ ఉంచుతుంది. మీ గురువు, ఫ్రెండ్ గానూ మారుతుంది. మీపై మీరు పెంచుకున్న నమ్మకం మానవాతీత వ్యక్తిగానూ మారుస్తుంది’ అని సమంత రాసుకొచ్చింది. అయితే ఈ ఫొటో చూసిన చాలామంది సమంత హిందూ? లేదా క్రిస్టియనా? అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘ఖుషి’ మూవీతో పాటు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. మరి సమంత స్పెషల్ గా పూజ, ధ్యానం చేస్తున్నట్లు ఉన్న పిక్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.