సమంత.. ఇండియన్ సినిమాలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. మరోవైపు మయోసైటిస్ నుంచి కూడా సమంత త్వరగా కోలుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతకొంత కాలంగా సమంత సిటాడెల్ ప్రాజెక్టులో నటిస్తోందని కొందరు, ఆమె ఛాన్స్ కోల్పోయింది అంటూ ఇంకొందరు ప్రచారాలు చేశారు. అయితే దానిపై ఇప్పుడు ఓ స్పష్టత వచ్చింది. సమంత ఈ ప్రాజెక్టులో నటిస్తోందని అధికారిక ప్రకటన వచ్చింది. హీలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనిలో వరుణ్ ధావన్- సమంత లీడ్ రోల్స్ ప్లే చేయనున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్- డీకేనే ఈ సిరీస్ ని కూడా తెరకెక్కిస్తున్నారు. సమంత షూటింగ్ లో పాల్గొన్న విషయాన్ని వారి సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. “ఈ పవర్ హౌస్ మరోసారి పనిచేయడానికి ఎంతో ఎక్జైటెడ్ గా ఉన్నాం. సిటాడెల్ ప్రపంచానికి స్వాగతం సమంత” అంటూ రాజ్- డీకే.. సమంత ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టును సమంతతో కలిసి షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సమంత ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది అంత సాదాసీదా ప్రాజెక్టు మాత్రం కాదు. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ నుంచి రాబోతున్న అతిపెద్ద టీవీ సిరీస్. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్: రింగ్స్ ఆఫ్ పవర్’ అనే సిరీస్ తర్వాత ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్ కాబోతోందని చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకుని సమంత అభిమానులు ఆనందంగా ఉంటే.. విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖుషీ సినిమా షూటింగ్ కోసం సమంత డేట్స్ ఇవ్వడం లేదంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు సిటాడెల్ అప్ డేట్ రాగానే.. విజయ్ దేవరకొండ అభిమాని ఒకరు సమంతను ప్రశ్నించాడు. ‘మరి ఖుషీ సినిమా సంగతేంటి?’ అని ట్విట్టర్ వేదికగా సమంతను ట్యాగ్ చేస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ అభిమాని వేసిన ప్రశ్నకు సమంత రెస్పాండ్ అయ్యింది.
🫶🏻@rajndk https://t.co/JwDGfjdQqS
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023
‘విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు.. ఖుషీ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం అవుతుంది.’ అంటూ సమంత పోస్ట్ చేసింది. ఎట్టకేలకు ఖుషీ సినిమా గురించి ఓ అప్‌డేట్ వచ్చిందని రౌడీ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. త్వరలోనే షూట్ స్టార్ట్ అవుతుందని తెలియగానే సంబరాలు చేసుకుంటున్నారు. సమంత క్షమాపణలు చెప్పడంపై ఆమె అభిమానులు స్పందిస్తున్నారు. ‘నువ్వు కావాలని చేసింది కాదు.. నీ ఆరోగ్య పరిస్థితి అలా ఉంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు సమంత స్పందించడంపై కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#Kushi will resume very soon .. my apologies to @TheDeverakonda fans 🙏@ShivaNirvana @MythriOfficial https://t.co/jW6cm9H4Qc
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023