సమంత.. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎంతో యాక్టివ్ గా ఉండి.. ఫిట్ నెస్ వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసేది. కానీ, ఇప్పుడు కేవలం ఇంటికి పరిమితమౌతూ ఉంటోంది. తాజాగా సమంత నెటిజన్లు, తన అభిమానులతో ముచ్చటించింది.
ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ ట్వీట్స్ కు సమంత సమాధానాలు చెప్పింది. అందరూ సమంత కోసం ప్రే చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అభిమానుల ప్రేమాభిమానాలు, ప్రార్థనలే తనని ధైర్యంగా మారుస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది. ఓ నెటిజన్ మీ జీవితం ఎలా సాగుతోందని అడగ్గా.. మునుపటి కంటే చాలా భిన్నంగా ఉందంటూ సమాధానం ఇచ్చారు. మీకు మేమున్నాం.. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. అందుకు సమంత మీ ఆశీస్సులు, దీవెనలు నాకు ఎంతో అవసరం అంటూ సమాధానం చెప్పింది.
Different !! https://t.co/IPiCvvkCkQ
— Samantha (@Samanthaprabhu2) January 2, 2023
శాకుంతలం సినిమా గురించి కూడా అభిమానులు ప్రశ్నించారు. సినిమా ఎలా ఉండబోతోందని అడగ్గా.. మీరే చూస్తారుగా అంటూ రిప్లై ఇచ్చింది. ఇంకా చాలా మంది ట్విట్లకు సమంత సమాధానం చెప్పింది. తన కోసం ప్రార్థిస్తున్న, తాను ఆరోగ్యంగా మారాలని, తిరిగి మునుపటి స్థితికి రావాలని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సమంత కృతజ్ఞతలు తెలిపింది. శాకుంతలం సినిమా విషయానికి వస్తే.. దేవ్ మోహన్- సమంత సరసన నటిస్తున్నాడు. మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ శాకుంతలం సినిమా తెరకెక్కించాడు. గతంలో ఓ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ దీనిని త్రీడీ అందించాలనే కోరికతో వాయిదా వేశారు. ఇప్పడు ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Witness the #EpicLoveStory #Shaakuntalam in theatres from Feb 17th 2023 Worldwide! Also in 3D 🦢@Gunasekhar1 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #MythologyforMilennials #ShaakuntalamOnFeb17 pic.twitter.com/dwOEdsKCna
— Samantha (@Samanthaprabhu2) January 2, 2023