సినిమా షూటింగ్ సందర్భంగా సమంతం ఎంతో శ్రమకు ఓడ్చారు. మైయోసైటిస్‌తో బాధపడుతున్నా కూడా ఆమె షూటింగ్‌కు అంతరాయం కలగకుండా చూసుకున్నారు. తన బాధను నొక్కి పట్టి సినిమా కోసం పని చేశారు.
సినిమాల్లో నటించటం అంటే అంత వీజీ కాదు. ఎంతో ఓపిక ఉండాలి. కొన్ని సన్ని వేశాల్లో నటించటానికి ఓపికతో పాటు బాధను భరించగలిగే శక్తి కూడా ఉండాలి. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. ఇంత చేసినా సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం లేదు. అయినప్పటికి హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేయాల్సి వస్తుంది. ఇలా హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా మీద ప్యాషన్‌తో పని చేసే అతికొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది.
ఈ సినిమా కోసం యాక్షన్ సీన్లలో సమంత నటించకపోయినా.. పౌరాణిక సినిమా కావటంతో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సినిమా కోసం ఆమె పడ్డ కష్టాల గురించి ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను సినిమా కోసం కొన్ని పూలను నా చేతులకు, మెడకు వేసుకునేదాన్ని.. అంతా బాగానే ఉండేది.. సాయంత్రం వాటిని తీసేసిన తర్వాత నా చేతులకు పూల అచ్చు ఏర్పడింది. ఆ అచ్చు దాదాపు ఆరు నెలల పాటు ఉండింది. ఇక అది పోదేమో అనుకున్నా.. కానీ, అదృష్టం కొద్ది అది పోయింది. శాకుంతలం సినిమా షూటింగ్ సందర్భంగా నన్ను ఓ కుందేలు కరిచింది.
ఓ పాట కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లెహెంగాలు వేసుకున్నాను. వాటి బరువు దాదాపు 30 కేజీలు ఉండేది. వాటిని వేసుకుని డ్యాన్స్ చేస్తున్నపుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. డ్యాన్స్ చేస్తూ తిరుగుతున్నపుడు అది నన్ను దూరంగా తీసుకెళ్లేది. కొన్ని షాట్ల కోసం 10, 15 టేకులు తీసుకునేదాన్ని. ఈ సినిమా కోసం మొత్తం మూడు భాషల్లో నేనే స్వయంగా డబ్బింగ్ చేసుకున్నాను. అది చాలా కష్టంగా అనిపించింది. ’’ అని చెప్పుకొచ్చారు. ఇవి కేవలం ఆమె పడ్డ కొన్ని కష్టాలు మాత్రమే. బయటకు తెలియని ఎంతో శ్రమ ఈ సినిమా కోసం సమంత పడ్డారు. సినిమా కోసం ప్రతీ హీరోయిన్ పడే కష్టమే ఇది.. ఇందులో ప్రత్యేకత ఏముంది అని మీరు అనుకోవచ్చు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆమె మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూనే షూటింగ్‌లో పాల్గొన్నారు. నిలబడడానికి ఓపిక లేకపోయినా ఎంతో కష్టపడ్డారు. కొన్ని నెలల పాటు సినిమా కోసం శ్రమించారు. ఇంత కష్టపడ్డా సినిమా విషయంలో ఆమెకు నిరాశే ఎదురైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘శాకుంతలం’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఒకరకంగా చెప్పాలంటే.. దర్శకుడి కష్టంతో పాటు సమంత కష్టం కూడా వృధా అయింది. మరి, శాకుంతలం సినిమా విషయంలో సమంత పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.