టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ చై- సామ్ విడాకుల సంఘటన ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్‌టాపికే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి విడాకులకు గల కారణాలపై స్పష్టత లేనప్పటికీ.. మొదట్లో అందరూ సమంతనే నిందించారు. అంతేకాదు.. సమంత నాగ చైతన్య నుంచి రూ. 250 కోట్లు భరణం తీసుకుందని ప్రచారం చేసారు. చేస్తున్నారు కూడాను. ఈ తరుణంలో సమంత తండ్రి ఆనాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టు చూసిన ప్రతిఒక్కరూ ఏ తండ్రికి ఇలాంటి బాధ రాకూడదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వివరాలు..
చై- సామ్ విడాకుల ఘటనపై. ఇరు కుటుంబ సభ్యులు ఏనాడూ స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కుమార్తె విడాకులపై స్పందించారు. “సమంత-నాగ చైతన్య విడాకుల విషయం తెలియగానే తన మైండ్ బ్లాక్ అయ్యందంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయం వినగానే మొదట తనకు ఏమీ అర్థం కాలేదని, కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందని తెలిపారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు చెప్పినట్లు పేర్కొన్నారు. అయినా.. తన కూతురు స్పృహ ఉండే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని, త్వరలోనే అన్ని పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నానని సామ్ తండ్రి పేర్కొన్నారు. అంతేకాదు..
LONG LONG AGO ;
THERE WAS A STORY ;
AND IT DOESN’T EXIST ANYMORE !!!
SO, LET’S START A NEW STORY ;
AND A NEW CHAPTER !!! అని ఎమోషనల్ పోస్టు రాసుకొచ్చారు.
చాలా కాలం క్రితం నాటి జ్ణాపకాలు. ఇప్పుడు లేవనుకోండి. ఇకపై ఉండవు కూడా. కాబట్టి, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టు చూశాక.. సమంత ఫ్యామిలీ, చైతునూ ఎంతగా ఇష్టపడిందో స్పష్టంగా అర్థమవుతుంది. కాగా, 2017 అక్టోబర్ 6, 7 తేదీలలో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరిద్దరూ ఒక్కటవ్వగా, 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.