Samantha: సౌత్‌లోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె తన అందంతో, అభినయంతో గత పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో హిందీలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక, సమంత తన అభిప్రాయాలను వెల్లడించడంలో నిర్మొహమాటంగా ఉంటారు. గతంలో ఆమె నరేంద్ర మోదీకి మద్దతుగా చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆమె కామెంట్లకు సంబంధించిన రెండు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓ వీడియోలో ఆమె.. ‘‘ నేను ఎల్లప్పుడూ మోదీజీ సపోర్టర్‌ను.
ఆయన చేసే మంచి కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నా’’ అని అన్నారు. మరో వీడియోలో ఆమె.. ‘‘నేను మోదీ సపోర్టర్‌ను.. ఆయన నాయకత్వంలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతున్నాను. ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తారు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తెస్తారు’’ అని అన్నారు. ఆమె ఈ మాటలని సంవత్సరంపైనే అయింది. మోదీ ప్రస్తుత నిర్ణయాల నేపథ్యంలో ఈ వీడియోలను షేర్ చేసి సమంతపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఎల్పీజీ సిలిండర్ 1100 రూపాయలు అయింది.
ఆమె నటి కాకపోయి ఉంటే సాధారణ ప్రజల కష్టం తెలిసేది. కానీ, ఇప్పుడామె ఓ కోటీశ్వరురాలు’ అంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, సమంత ప్రస్తుతం మూడు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. హరి-హరిష్ దర్శకత్వంలో యశోద..గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చేస్తున్నారు. ఇందులో యశోద బైలింగువల్‌గా తెరకెక్కుతోంది. మరి, గతంలో మోదీపై సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Just another Reason to Love @Samanthaprabhu2 😻😻 pic.twitter.com/ZjdTRVlR2n
— Amit Kumar (@AMIT_GUJJU) September 1, 2022
ఇవి కూడా చదవండి : NTR32: పాన్ ఇండియా స్టార్ అయ్యే సమయంలో ఎన్టీఆర్ కు ఈ రిస్క్ అవసరమా?