సమంత హైదరాబాద్‌లోని ఓ ప్రదేశంలో ఓ లగ్జరీ ప్లాట్ కొన్నారట. ఈ ప్లాట్ కొనడానికి ఆమె పెద్ద మొత్తంలో చెల్లించారట. త్వరలో సమంత ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందట.
వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయారు పాన్ ఇండియా హీరోయిన్ సమంత. ఆమె నటిస్తున్న ఖుషీ, చెన్నై స్టోరీ సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. అంతేకాదు! ఆమె నటిస్తున్న ‘సిటడెల్’ అనే టీవీ షో సైతం శరావేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఓ న్యూస్ మీడియా సర్కిల్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. సమంత హైదరాబాద్‌లో ఓ లగ్జరీ ఇళ్లు కొన్నారట. నగరంలోని జయభేరీ ఆరంజ్ కౌంటీలో ఆమె ప్లాట్ కొన్నట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లోని 13వ అంతస్తులో ఆమె ఈ ఇంటిని కొన్నారట. అది కూడా 3 బీహెచ్‌కే ఫ్లాట్ కొన్నారట.
ఆ ఇంటికి ఆరు పార్కింగ్ స్లాట్లు ఉన్నాయట. ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ పనులు మొత్తం పూర్తయ్యాయట. ఎంతో లగ్జరీగా ఉండే ఈ ఇంటిని ఆమె పెద్ద మొత్తంలో చెల్లించి కొన్నారట. ఇందుకోసం ఏకంగా 7 కోట్ల రూపాయలకు పైగా చెల్లించారట. సమంత ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ పలాషియల్ ఇంట్లో ఉంటున్నారు. గతంలో సమంత, నాగ చైతన్య కలిసి ఈ ఇంట్లో ఉండేవారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఈ ఇంట్లో ఉంటున్నారు. కొత్త ఇంటి పనులు పూర్తయిన తర్వాత సమంత అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది.
కాగా, సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ బాక్సాఫీస్ వద్ద అంతగా రానించలేకపోయింది. దర్శకుడు గుణశేఖర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. శాకుంతలం సినిమా దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా ఏప్రిల్ 14 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, సమంత హైదరాబాద్‌లో 7 కోట్ల రూపాయలు పెట్టి ఇళ్లు కొన్నదన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.