గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యంగ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య-సమంతలు విడాకులు తీసుకోబోతున్నారన పుకార్లకు నిన్నటితో క్లారిటీ ఇచ్చారు.విడాకులు తీసుకున్నట్లుగా అక్కినేని నాగచైతన్య-సమంత అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త విషయం తెరపైకి వచ్చింది. ‘ఏం మాయ చేసావే ’ చిత్రం తర్వాత కొంతకాలం సమంత-చైతూ ప్రేమలో మునిగిపోయి పెళ్లికూడా చేసుకున్నారు. ఆ సమయంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండేది.. ఈ నేపథ్యంలోనే పెళ్లికి ముందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్రీ-మ్యారిటల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ తండ్రి ప్రీ-మ్యారిటల్ అగ్రిమెంట్ ప్రతిపాదన ఒకటి తీసుకొస్తాడు… గుర్తుందా? అటువంటి అగ్రిమెంట్ నాగచైతన్య-సమంత పెళ్ళికి ముందు చేసుకున్నారని, ఆమెకు ఎటువంటి భరణం అందదని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
అయితే ఈ ప్రీ-మ్యారిటల్ అగ్రిమెంట్ అనే సాంప్రదాయం ఇప్పటి నుంచి కాదు.. గత కొన్నేళ్లుగా కొనసాగుతుంది. వేల కోట్ల ఆసులు ఉన్న ధనికులు ఇష్ట పూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నా.. ప్రీ-మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. దానికి కారణం ఒకవేళ తమ వైవాహిక దాంపత్యంలో ఏదైనా తేడా వచ్చి విడిపోతే భరణం చెల్లించే విషయంలో ఎలాంటి గొడవలు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ అగ్రిమెంట్ చేయించుకుంటారని టాక్. అయితే ఇలాంటి ప్రీ-మ్యారిటల్ అగ్రిమెంట్ నాగ చైతన్య-సమంతల వివాహానికి ముందు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే చేసుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇదే గనక జరిగితే సమంతకు భరణం ఇవ్వాల్సి అవసరం ఉండదు.
మరోవైపు ఇటు అక్కినేని… అటు దగ్గుబాటి… తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు బలమైన కుటుంబాల కు చెందిన నాగచైతన్యకు వారసత్వంగా వచ్చిన ఆస్తి తక్కువేం కాదు. అయినా కూడా సమంతకు భరణం కింద అక్కినేని ఫ్యామిలీ మాత్రం రూ. 200కోట్ల ఇవ్వటానికి సిద్ధమయ్యారంటూ.. నాగార్జునే స్వయంగా సమంతకు ఈ ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. స్వతంత్ర భావాలు గల మహిళగా.. సెల్ఫ్ మేడ్ ఉమెన్‌గా ఉండేందుకే భరణం తీసుకునేందుకు సమంత ఒప్పకుంటుందా లేదా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.