Samantha: సౌత్‌లో దశాబ్ధానికిపైగా టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సమంత. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడి ప్రేక్షకులతో కూడా శభాష్ అనిపించుకున్నారు. ‘ఊ అంటావా.. మావ ఊఊ అంటావా’ ఐటమ్ సాంగ్‌తో దేశ వ్యాప్తంగా ఓ రికార్డును క్రియేట్ చేశారు. తాజాగా, సమంత ప్రముఖ బాలీవుడ్ హోస్ట్ కరణ్ జోహార్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్: సిజన్ 7’లో పాల్గొన్నారు. హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి ఈ షోకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరణ్ జోహార్ నాగ చైతన్య గురించి ఆమెను ప్రశ్నించారు. కరణ్.. నాగ చైతన్యను సమంత భర్త అని అనగా.. ఆమె వెంటనే స్పందించి ‘మాజీ భర్త’ అని కరెక్ట్ చేశారు. నాగ చైతన్య గురించి కరణ్ అడిగిన మరో ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే.. అక్కడ పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. అవును, ఇప్పటికైతే అంతే!.. కానీ, భవిష్యత్తులో అది ఎప్పుడైనా కావచ్చు’’ అని అన్నారు.
కాగా, సమంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’.. హరి, హరిష్‌ల దర్శకత్వంలో ‘యశోధ’.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు. ఖుషి సినిమాలో విజయ్ దేవర కొండ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. సమంత, విజయ్‌లు జంటగా కలిసి నటించటం ఇది రెండో సారి. మహానటి సినిమాలో మొదటి సారి జంటగా నటించారు. మరి, నాగ చైతన్యపై సమంత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Naga Chaitanya: మహేశ్ బాబు ఫ్యాన్ గా నాగచైతన్య! వైరల్ అవుతున్న బ్యానర్!