సమంత తన అభిమాని అడిగిన ఓ ప్రశ్నకు ట్విటర్ ద్వారా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సమంత తన కొత్త బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మైయోసైటిస్ అనారోగ్యం కారణంగా సమంత జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో స్వయంగా ఆమే చెప్పుకొచ్చారు. మైమోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆమె తన గ్రూమింగ్‌లో పలు మార్పు చేసుకున్నారు. పాత లుక్‌లతో కాకుండా కొత్త లుక్‌లతో బయటకు వస్తున్నారు. అంతేకాదు! గ్రోసిరీస్‌ను తన గ్రూమింగ్‌లో భాగం చేసుకున్నారు. ప్రతీ ఈవెంట్‌లో తళుక్కున మెరుస్తున్నారు. సాధారణ సినిమా ప్రేక్షకులను అభిమానులను ఆమె అలంకరణ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
సమంత అలంకరణపై.. మైయోసైటిస్‌తో బాధపడుతూ కూడా ఆమె అందంగా కనబడటాన్ని మెచ్చుకోలేకుండా ఉన్నారు. తాజాగా, ఓ అభిమాని ఆమె అందం గురించి ఓ రేంజ్‌లో పొగిడేశాడు. శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత తన ఫ్యాన్స్‌తో ట్విటర్‌లో ‘ఆస్క్ సామ్’ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని ‘‘ యువతిలా కనిపిస్తున్న మీ న్యూ లుక్ చాలా బాగుంది. మీరేమీ అనుకోకపోతే కొంతకాలం దీన్ని ఇలానే కొనసాగిస్తారా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు సమంత తన చేత్తో హార్ట్ సింబల్ చూపిస్తూ నవ్వుతూ దిగిన ఫొటోను జతచేశాడు. అతడి కాంప్లిమెంట్‌పై సమంత స్పందించారు.
‘‘ కంటి అద్దాలు నా కొత్త మంచి స్నేహితులు’’ అని పేర్కొన్నారు. కాగా, సమంత నటించిన శాకుంతలం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు గుణ శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మింపబడిన ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. మరి, సమంత కొత్త బెస్ట్ ఫ్రెండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Glasses are my new best friend 🤓🤍#Shaakuntalam https://t.co/X9151BOZx2
— Samantha (@Samanthaprabhu2) April 9, 2023