స్టార్ హీరోకు గ్యాంగ్‌స్టర్ ధమ్కీ ఇచ్చాడు. తమకు బహిరంగ క్షమాపణ చెబితే క్షమిస్తానని.. లేదంటే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే..!
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ప్రత్యేకమనే చెప్పాలి. సౌత్ హీరోల్లాగా మాస్ ఇమేజ్ ఆయన సొంతం. అందుకే మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ మూవీస్ చేస్తుంటాడీ హీరో. త్వరలో ‘కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న సల్లూభాయ్.. ‘కిసీ కా భాయ్’తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇదిలాఉండగా.. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్లూ మియాకు కోర్టు నుంచి ఊరట లభించిన సంగతి విదితమే. అయితే ఇప్పటికీ ఈ విషయంలో ఆయనకు తిప్పలు తప్పడం లేదు. కృష్ణ జింకలను కులదైవంగా పూజించే బిష్ణోయ్ తెగ ప్రజలు సల్మాన్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
ఇటీవల సల్మాన్‌పై గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హత్యాయత్నం చేసి విఫలమైన విషయం విదితమే. ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లారెన్స్.. ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సల్లూభాయ్‌పై బెదిరింపులకు దిగాడు. సల్మాన్ మీద తమ సమాజంలో తీవ్ర ఆగ్రహం ఉందన్న లారెన్స్ బిష్ణోయ్.. ఆయన తమను అవమానించాడన్నాడు. సల్మాన్‌ను జోధ్‌పూర్‌లోనే చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ ఆయన గనుక తమ కులదైవం ఆలయాన్ని దర్శించుకుని తమ వారికి సారీ చెబితే క్షమిస్తానని లారెన్స్ బిష్ణోయ్ స్పష్టం చేశాడు. ఇకపోతే, గతేడాది మే నెలలో జరిగిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది తమ పనేనంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. దీంతో లారెన్స్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.
WATCH | अपना नाम बड़ा करने के लिए सलमान खान को धमकी देता है लॉरेंस बिश्नोई ? जानिए क्या बोला @RubikaLiyaquat | @akhileshanandd | @jagwindrpatial
LIVE – https://t.co/4StwkoboMD#OperationDurdantOnABPNews #LawrenceBishnoi #SalmanKhan pic.twitter.com/OaTqFxdNC9
— ABP News (@ABPNews) March 14, 2023