బాలీవుడ్ భామ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ ఒకటి కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈనెల 9న ఈ జంట పెళ్లి జరగనుందని వినికిడి. వీరి వివాహానికి అంత సిద్దమవుతున్నట్లు సమాచారం. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లోని సిక్స్ సెన్స్ పోర్ట్ బర్వారా ఇందుకు వేదిక అయింది. కుటుంబ సభ్యులు మరియు అతి కొద్ది మంది సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి నిరాడంబరంగా జరుగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే కత్రినా, విక్కీ రాజస్థాన్ చేరుకున్నారు. వీరి పెళ్లి కత్రినా స్నేహితుడు సల్మాన్ ఖాన్ హాజరవుతారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ తమకు కత్రినా నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదని సల్మాన్ ఖాన్ చెల్లి అర్పితా ఖాన్ తెలిపిన విషయం తెలిసిందే. విక్కీ- కత్రినాల పెళ్లికి సల్మాన్ ఖాన్ వచ్చే అవకాశం లేదని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ విషయం పక్కనబెడితే విక్కీ క్యాట్ పెళ్లికి సల్మాన్ పెద్ద బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
సల్మాన్ సెక్యురిటీ సిబ్బంది మొత్తం పెళ్లి రోజున వేదిక వద్ద విధులు నిర్వర్తించనున్నరని సమాచారం. సల్మాన్ బాడీగార్డ్ షేరా కత్రినా-వీక్కీల పెళ్లికి అవసరమైన భద్రతా సిబ్బంది పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా సల్మాన్ ఖాన్ ఆదేశాల మేరకు షేరా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెళ్లి రోజు షేరా అక్కడే ఉండాలని సల్మాన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్ల గా టైగర్ సెక్యురిటీ సంస్థ సల్మాన్ కు భద్రత కల్పిస్తుంది. దీనికి షేరా నాయకత్వం వహిస్తున్నాడు. సల్మాన్ కు షేరా నమ్మిన బంటు. అందుకే సల్మాన్ పెళ్లికి హాజరు కాకపోయినా షేరాని పంపిస్తున్నట్లు తెసుస్తోంది. కత్రినా ఇష్టాయిష్టాలు తెలిసిన సల్మాన్ ఖాన్ షేరాతో పాటు ఆమెకు ఇష్టమైన ఓ పెద్ద గిఫ్ట్ కూడా పంపిస్తున్నట్లు సమాచారం.
గతంలో కత్రినా, సల్మాన్ ఖాన్ లు రీలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. మిగతా హీరోయిన్లతో పోలిస్తే సల్మాన్ విషయంలో కత్రినా ఎక్కువగానే ఫోకస్ అయింది. ఒకానొక సమయంలో సల్మాన్ ఖాన్ తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ చెప్పి, కత్రినాను వివాహం చేసుకుంటాడని టాక్ వచ్చింది. కానీ ఏం జరిగిందో తెలియదు ఇద్దరు బ్రేకప్ అయ్యారు. అనంతరం కత్రినా రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. చివరికి కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాలపై మీ అభిప్రాయాన్నికి కామెంట్స్ రూపంలో తెలియజేయండి.