బాలీవుడ్ కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ సారి ఏకంగా ముంబై పోలీసులకు ఫోన్ చేసి మరీ ఆ వ్యక్తి బెదిరించడం గమనార్హం. ఆ వివరాలు..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను హత్యా బెదిరింపులు వదలడం లేదు. గతంలో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు కొందరు రెక్కీ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తృటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు సల్మాన్ ఖాన్. ఇక గత నెలలో సల్మాన్‌ను చంపుతామంటూ రెండుసార్లు.. బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. ఇక సల్మాన్‌ను హత్య చేస్తానంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బిష్ణోయ్ సన్నిహితుడు ఒకరు సింగర్ సిద్ధూ మూసేవాలను చంపినట్లే సల్మాన్‌ను కూడా చంపేస్తామని బెదిరించాడు.
ఈ బెదిరింపుల నేపథ్యంలో తాజాగా సల్మాన్ కోటి రూపాయలు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కారు తీసుకున్నాడు. ఎక్కడకు వెళ్లిన కట్టుదిట్టమైన భద్రత మధ్యే బయటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా సల్మాన్‌ను చంపుతామంటూ ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే కాల్ చేయడం.. డెడ్‌లైన్ కూడా విధించడం సంచలనంగా మారింది. ఆ వివరాలు.. రాజస్థాన్, జోధ్‌పూర్‌కు చెందిన రాకీభాయ్ అనే గోరక్షకుడు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి.. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించాడు. అది కూడా ఏప్రిల్ 30న చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది మొదిసారి కాదు. గత నెలలో కూడా రెండుసార్లు బెదిరింపులు వచ్చాయి. మార్చ్ 18, మార్చ్ 23 తేదీల్లో మెయిల్ ద్వారా సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. అంతేకాక జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ రారెన్స్ బిష్ణోయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కృష్ణజింక వివాదం కేసులో సల్మాన్ తమవారికి క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశాడు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ 2018లో కోర్టు ఆవరణలోనే బిష్ణోయ్ ప్రకటించడం గమనార్హం. వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ భారీ భద్రత నడుమే బయటకు వెళ్తున్నాడు. ఈ సారి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే కాల్ చేసి బెదిరించడం గమనార్హం. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.