సినిమా ఇండస్ట్రీ అనగానే హీరోహీరోయిన్స్ డేటింగ్, రిలేషన్ షిప్ లాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి నిజం కాగా, మరికొన్నిసార్లు మాత్రం అవి జస్ట్ వదంతులు మాత్రమే అని తేలుతుంది. ఏదేమైనా సరే అవి కాస్తంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి ఇలాంటి న్యూస్ లు వస్తూనే ఉన్నాయి. దీంతో జనాలకు కూడా అది చాలా నార్మల్ అయిపోయింది. అయితే రీసెంట్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తుందనే వార్త మాత్రం తెగ వైరల్ అయింది. మొత్తం సినీ ప్రేక్షకుల్ని ఒక్కసారిగా ఎట్రాక్ట్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పూజాహెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా యాక్టింగ్ కు ప్రయారిటీ ఉన్న పాత్రలు కూడా చేస్తుంది. ఓ వైపు అందాల విందు చేస్తూనే, మరోవైపు ఇంట్రెస్టింగ్ హీరోయిన్ రోల్స్ ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం పూజా.. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా చేస్తోంది. ఇది షూటింగ్ స్టేజీలో ఉంది. ఇందులో విక్టరీ వెంకటేశ్ కూడా కీ రోల్ చేస్తున్నారు. మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే సల్మాన్-పూజా మధ్య బాండింగ్ పెరిగిందని, సీక్రెట్ గా డేటినంగ్ కూడా చేస్తున్నారనే న్యూస్.. అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో వైరల్ అయింది. దీంతో అందరూ షాకయ్యారు. తాజాగా ఆ విషయంపై సల్మాన్ ఫ్రెండ్ ఒకరు క్లారిటీ ఇచ్చారు.
‘ఇలాంటి బేస్ లెస్ న్యూస్ ని వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుపడాలి. సల్మాన్ ఖాన్ కు పూజా కూతురు లాంటిది. వాళ్లిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే రూమర్స్ స్ప్రెడ్ చేస్తారా? కొంతమంది మూర్ఖులు, పబ్లిసిటీ వస్తుందని ఇలా చేస్తున్నారేమో, కానీ ఇది చాలా ఇబ్బంది కలిగించే అంశం’ అని సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబో త్వరలో షూటింగ్ కి రెడీ అయింది. ఇందులోనూ పూజా హెగ్డేనే హీరోయిన్ చేస్తోంది. మరోవైపు హరీశ్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబోలో రీసెంట్ గా అనౌన్స్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ పూజానే కథానాయిక అని, షూటింగ్ స్టార్ట్ కాగానే సెట్స్ లో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. ఇక పూజా హిందీలో చేసిన ‘సర్కస్’ సినిమా ఈనెల 23న థియేటర్లలోకి రానుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామాలో రణ్ వీర్ సింగ్ హీరో. సరే ఇదంతా పక్కనబెడితే. సల్మాన్-పూజా డేటింగ్ వార్తలు, దానిపై క్లారిటీ రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.