ఈ మద్య సినీ సెలబ్రేటీలకు బెదిరింపు కాల్స్, లేఖలు రావడం చూస్తూనే ఉన్నాం. సల్మాన్ ఖాన్ సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సల్మాన్ కి బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ ముంబై పోలీస్ కమిషనర్ ని కలిశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ విషయంలో సల్మాన్ పెద్దగా స్పందించకపోయినా.. భవిష్యత్ లో తనకు ఏదైనా ప్రమాదం జరగవొచ్చని బంధువులు, సన్నిహితులు అతనిని హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ప్రాణరక్షణ కోసం తుపాకీ కావాలంటూ సల్మాన్ ఖాన్ పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది. గన్ లైసెన్స్ కోసం సీపీ ఆఫీసుకు వెళ్లాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సాధారణంగా పోలీసు అధికారులు కాకుండా తుపాకులను వాడే వారిలో సెలబ్రెటీలు, వ్యాపార వేత్తలు తమ వద్ద ఉంచుకుంటూ ఉంటారు. ఇందుకోసం లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా బెదిరింపులు వచ్చినప్పుడు షరతులపై ప్రముఖులకు తుపాకీని ఉంచుకునేందుకు అనుమతి లభిస్తుంది.
ఇటీవల తనకు బెదిరింపులు రావడం వల్లనే సల్మాన్ ఖాన్ తన గన్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నారట్టు సమాచారం. పోలీస్ కమిషనర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే సల్మాన్ వెళ్లిపోయారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Actor Salman Khan leaves the office of Mumbai Commissioner of Police Vivek Phansalkar. pic.twitter.com/eiUYGkOPBc
— NDTV (@ndtv) July 22, 2022