బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వార్తల్లోకెక్కుతారు. ఇటీవల చంపేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడిన వార్తలు వచ్చాయి. తాజాగా సల్మాన్ ఖాన్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన హీరో సల్మాన్ ఖాన్. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించారు. మెగా ఫ్యామిలీతో ముఖ్యంగా రామ్ చరణ్ తో సల్మాన్ ఖాన్ కి మంచి అనుబంధం ఉంది. ఇక తెలుగు సినిమాలను రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఈ హీరో స్పెషాలిటీ. హలో బ్రదర్, ప్రేమ, పోకిరి, రెడీ, స్టాలిన్, కిక్ సినిమాలను రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటను సల్మాన్ ఖాన్ సినిమాలో పెట్టారు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో బతుకమ్మ పాటను పెట్టడం ద్వారా ఇంకో మెట్టు ఎక్కేశారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ కి అనేక మంది హీరోయిన్స్ తో మంచి సాంగత్యం ఉంది. చాలా మంది హీరోయిన్స్ ని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ లిస్టులో శ్రీలంకకు చెందిన బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉంది. ఈమె పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. జాక్వెలిన్, సల్మాన్ ఖాన్ లు కలిసి పలు సినిమాల్లో నటించారు. కిక్ సినిమాలో ఈ ఇద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. 2014లో విడుదలైన ఈ సినిమాతో జాక్వెలిన్ కి వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత ఈ ఇద్దరూ రేస్-3, రాధే సినిమాల్లో నటించారు. జాక్వెలిన్ కి బాలీవుడ్ లో తిరుగులేని నటిగా రాణిస్తుంది. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ జాక్వెలిన్ కి వరుసగా రెండు సార్లు ముద్దు పెట్టారు. ఆ తర్వాత తన పెదాలను టీ షర్ట్ కి తుడుచుకున్నారు. షూటింగ్ సెట్స్ లో తీసిన వీడియో అని తెలుస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక పక్కన నిలుచుని ఉండగా.. సల్మాన్ ఖాన్ ఆమె బుగ్గపై ముద్దు పెట్టారు. జాక్వెలిన్ నవ్వుకుంటుంటే.. సల్మాన్ ఖాన్ పక్కకు వెళ్ళిపోయి తన మూతిని టీ షర్ట్ తో తుడుచుకున్నారు. ఆమె బుగ్గ మీద ఉన్న మేకప్ తన పేదలకు అంటుకోవడం వల్ల సల్మాన్ ఇలా పెదాలను తుడుచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సల్మాన్, జాక్వెలిన్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. కరోనా లాక్ డౌన్ సమయంలో ఫార్మ్ హౌజ్ లో ఇద్దరూ కలిసే ఉన్నారని రూమర్లు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముద్దు పెట్టి మూతి తుడుచుకున్న సల్మాన్ ఖాన్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.