Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ హీరో తీస్తున్న రెండు ప్యాన్ ఇండియా సినిమాల నుంచి అప్‌డేట్‌లు సరిగా రాకపోవటమే ఇందుకు కారణం. దీంతో ఫ్యాన్స్ ఆవేదనలో కూడా ఉన్నారు. ఇక, ఆదిపురుష్ సినిమా విషయంలో మరింత ఆవేదనతో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏలాంటి అప్‌డేట్ రాలేదు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ప్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్ వచ్చింది. సలార్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ న్యూస్ వచ్చింది. ప్రముఖ పీఆర్ వంశీ శేఖర్ తన ట్విటర్ ఖాతాలో ఈ సాయంత్రం ఓ ట్వీట్ పెట్టారు. ‘‘ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్టు సలార్ అప్‌డేట్ మరో రెండు రోజుల్లో రాబోతోంది’’ అని పేర్కొన్నారు.
అయితే, సలార్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రానుందన్న సంగతి చెప్పలేదు. ఇక, ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా ఈ అప్‌డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కేజీఎఫ్ 1,2 సినిమాలను తెరకెక్కించిన ‘హోంబలె ఫిల్మ్స్’ సలార్‌ను తెరకెక్కిస్తోంది. కేజీఎఫ్ చిత్రాలకు పని చేసిన సాంకేతిక బృందమే ఈ సినిమాకు కూడా పనిచేస్తోంది. మరి, త్వరలో రాబోతున్న సలార్ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
PAN INDIA Star #Prabhas & @prashanth_neel ‘s Massive project #Salaar update in 2 days…!!
Stay tuned 🔥🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 12, 2022
ఇవి కూడా చదవండి : Kushitha: బజ్జీల పాపకు రవితేజ బంపర్ ఆఫర్.. ఏకంగా హీరోయిన్ గా ఛాన్స్!