ప్రభాస్ ఫ్యాన్స్ 'సలార్' మూవీ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లని ఆశ్చర్యపరిచేలా సరికొత్త అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అక్కడి అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతారనిపిస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా స్టార్. ఆరడగుల కటౌట్ గుర్తొస్తుంది. ‘బాహుబలి’ సినిమాతో తన క్రేజుని అమాంతం పెంచేసుకున్న ఇతడు.. ఆ తర్వాత మాత్రం కాస్త తడబడుతూనే ఉన్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. ప్రభాస్ రేంజ్ కు అవి సరిపోలేదని అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ల ఆకలి తీర్చడానికా అన్నట్లు ‘సలార్’ రెడీ అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఓ సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైపోయింది. ఇప్పుడు ఆ విషయమే ఇండస్ట్రీలో వైరల్ అయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ రావడంతో భారతీయ సినిమా స్థాయి పెరిగింది. పలువురు నిర్మాతలు కూడా తమ తమ సినిమాల్ని విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ‘పుష్ప’ రష్యన్ లో రిలీజైంది. ‘కాంతార’ స్పానిష్, ఇటాలియన్ లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ రూట్ లోనే అన్నట్లు ‘సలార్’ ఇంగ్లీష్ వెర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ కొన్నిరోజుల ముందే వచ్చినప్పటికీ.. ఇప్పుడు దానికితోడు క్రేజీ అప్డేట్ ఒకటి వచ్చింది. ఇది చూసి ఇదెక్కడి మాస్ రా మావ అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
‘సలార్’ నిర్మాతలు.. ఈ మూవీని భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారని తెలుస్తోంది. అయితే ఇంగ్లీష్ ఆడియెన్స్.. సినిమాలోని కామెడీ, సాంగ్స్ వల్ల అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని నిర్మాతలు భావించారు. అందులో భాగంగానే ‘సలార్’లో కామెడీ సీన్స్, సాంగ్స్ ని కట్ చేసి సరికొత్త వెర్షన్ ని రిలీజ్ చేయబోతున్నారట. తెలుగులో 2:30 గంటలుంటే.. ఇంగ్లీష్ లో మాత్రం 2 గంటల్లోపే మూవీ నిడివి ఉండదనుందట. ఒకవేళ ఇదే నిజమైతే మన దేశంలో ఇలాంటి ప్రయోగం చేయబోతున్న ఫస్ట్ మూవీ ‘సలార్’ అవుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇంగ్లీష్ వెర్షన్ లో సలార్ చూద్దామనుకునే ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావొచ్చు! మరి ‘సలార్’ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
• #Prabhas‘s #Salaar English version will not have songs,comedy scenes & 30 minutes lesser duration than Telugu version💥
• Salaar 2 Parts fix 🔥
• Salaar will be Releasing on Sept 28th ,2023 🔐 pic.twitter.com/NCTUy0AQXD
— ᴠɪꜱʜᴀʟ 🏹 (@vishal_x_x_7) March 23, 2023