దక్షిణాధి చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న నటి సాయిపల్లవి. ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు తమిళం, మళయాళం వంటి సినీ పరిశ్రమల్లో ఎనలేని అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల ఆమె నటించిన లవ్ స్టోరీ సినిమా హిట్ తో సాయిపల్లవి ఇప్పుడు మంచి జోష్ లో ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తన లైఫ్ స్టైల్, అందం గురుంచి కామెంట్స్ చేసింది.
నేను సినిమాల్లో అడుగు పెట్టేముందు నా అందం విషయంలో చాలా ఆందోళన చెందానని తెలిపింది. ఎందుకంటే మిగతా హీరోయిన్ లతో పోలిస్తే నాకు ముఖంపై చాలా పింపుల్స్ ఉంటాయని దీంతో చాలా కలత చెందేదానని మనసులో మాట బయటపెట్టింది. అయితే ఎప్పుడైతే ప్రేమమ్ మూవీ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఆ ఆందోళన మొత్తం పటాపంచలైందని తెలిపింది. ఇక ప్రేక్షకులు అందాన్ని కాదని క్యారెక్టర్ ని మాత్రమే ఇష్టపడతారని సాయిపల్లవి మనసులోని మాటలు బయటపెట్టింది.