సాధారణంగా ఒక భాషలో నటించే హీరోయిన్లకు వేరే భాషలో క్రేజ్ రావడం అనేది చాలా అరుదు. అలాంటి క్రేజ్, ఆ స్థాయి అభిమానం సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. మలయాళంలో “ప్రేమమ్” అనే సినిమాతో అక్కడ ఎంత క్రేజ్ తెచ్చుకుందో..తెలుగులో కూడా “ఫిదా” సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అంతే స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఆమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి అంటే.. ఓ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే ఓ ఎమోషన్ అనేంతలా అభిమానులకు దగ్గరైంది.
అభిమానులు ఆమెను ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుచుకుంటున్నారు. ఆమె నటించిన “గార్గి” చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆమె థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల మధ్యలోనే సినిమా వీక్షిస్తుంది. తాజాగా ఓ థియేటరకు వెళ్లిన సాయిపల్లవి.. ఆమె అభిమానులకు షాకిచ్చింది. సినిమా ఎండింగ్ సమయంలో వచ్చి అభిమానులతో స్వయంగా తానే సెల్ఫీ తీస్తూ సర్ ఫ్రైజ్ చేసింది.
ఇటీవల విరాటపర్వం సినిమాలో వెన్నెల పాత్రలో నటించిన సాయి పల్లవి మరొకసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇదిలా ఉండగా “విరాట పర్వం” తర్వాత సాయి పల్లవి “గార్గి” సినిమాలో నటించింది. ఈ సినిమా ఎటువంటి అంచనాల లేకుండా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సాయి పల్లవి నటించిన గార్గి సినిమా జూలై 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే సాయి పల్లవి చెన్నై, హైదరాబాద్ లలోని పలు థియేటర్లను సందర్శించారు.
సినిమా క్లైమాక్స్ సమయంలో థియేటర్ లోపలికి వెళ్లి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ చేసింది. పల్లవి సడెన్ ఎంట్రీ.. ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఆమె నటనకు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో అభిమానలతో సాయిపల్లవి ఫోటోలు దిగింది. కొంత మందికి తానే స్వయంగా సెల్ఫీ తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా సాయి.. “శ్యామ్ సింగారాయ్” సినిమా చూడటానికి భూర్ఖా వేసుకొని ఓ థియేటర్ కి వెళ్ళింది. మరి.. తాజాగా అభిమానులకు సాయిపల్లవి స్వయంగా సెల్ఫీ ఇస్తూ సందడి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sai Pallavi surprise theatre visit during #Gargi
Presented by @2D_ENTPVTLTD
Release by @SakthiFilmFctry
Produced by @blacky_genie
pic.twitter.com/MZXTXZvZcX— Karthik Ravivarma (@Karthikravivarm) July 17, 2022
ఇదీ చదవండి: Pokiri: మరోసారి థియేటర్లోకి రానున్న పోకిరి మూవీ..!
ఇదీ చదవండి: వీడియో: విజయ్ దేవరకొండ జీవితాన్ని మలుపు తిప్పిన ఆడిషన్ ఇదే!
ఇదీ చదవండి: Bollywood: భర్తపై ముద్దుల వర్షం కురిపించిన నటి.. ఫోటోలు వైరల్..