సెలబ్రెటీలు బయటకు వస్తే అభిమానులతో పాటు ఫోటో, వీడియో గ్రాఫర్లు ఎంత హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ సెలబ్రెటీల వెంట పడటం.. కొన్నిసార్లు వాళ్లు అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం.
సాధారణంగా సెలబ్రెటీలు బయటకు వస్తే అభిమానులతో పాటు ఫోటో, వీడియో గ్రాఫర్ల సందడి ఎక్కువగా ఉంటుంది. ఓ వైపు అభిమానులు తాకిడి.. మరోవైపు ఫోటో స్టిల్ ప్లీజ్ అంటూ వెంటపడటం.. కొంత మేరకు హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ కొన్నిసార్లు సెలబ్రెటీలు సహనం కోల్పోయి చిరాకు పడటమే కాదు.. కెమెరాలు లాగి నెలకు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి పరిస్థితి కొంతమంది ఫోటోగ్రాఫర్లకు ఎదురైంది.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఫొటోగ్రాఫర్లపై మండిపడ్డాడు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ ల కుమారుడు సైఫ్ అలీ ఖాన్.. ‘ఆషిక్ ఆవారా’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా పలు చిత్రాల్లో నటించాడు. కెరీర్ బిగినింగ్ లో మంచి ఫామ్ లో కొనసాగినప్పటికీ ఇటీవల సైఫ్ సినిమాలు చాలా వరకు తగ్గించుకున్నాడు. మొదట బాలీవుడ్ హీరోయిన్ అమృతా సింగ్ ని వివాహం చేసుకున్నాడు.. కొంత కాలం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమెతో జీవితాన్ని గడుపుతున్నాడు. ఇటీవల కరీనా, తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు సోసల్ మీడియాలో తె గ షేర్ చేస్తున్నాడు సైఫ్ అలీ కాన్.
సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్ తో ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లి తిరిగి తమ ఇంటికి వెళ్తున్న సమయంలో ఫోటో గ్రాఫర్లు వారిని ఫాలో అయ్యారు. అప్పటి వరకు వారితో సహనంగా మాట్లాడిన సైఫ్ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఫొటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశాడు. మార్చి 2 గురువారం నటి మలైకా అరోరా తల్లి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సైఫ్, కరీనా జంట కోసం ఫోటోగ్రాఫర్లు వెయిట్ చేస్తున్నారు. ఈ జంట అక్కడకు చేరుకోగానే వరసగా కెమెరా ఫ్లాష్ లు మెరవడం మొదలయ్యాయి.
సార్.. మేడమ్ ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ ఫోటో గ్రాఫర్లు వెంట పడటం మొదలు పెట్టారు. సైఫ్, కరీనా ఇద్దరూ వేగంగా నడుచుకుంటూ తమ ఇంటివైపు వెళ్తున్న సమయంలో ఫోటో గ్రాఫర్లు ఫాలో కావడంతో చిర్రెత్తుకొచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ‘ ఓ పని చేయండి మా బెడ్ రూమ్ లోకి రండి’ అంటూ సీరియస్ అవుతూ ఇంట్లోకి వెళ్లిపోయారు. విరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.