తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ కుటుంబం నుంచి నట వారసత్వం పుచ్చుకున్న హీలు వెండితెరపై తమదైన ముద్ర వేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తన తమ్ముడి మూవీ అయిన ‘రంగ రంగ వైభవంగా‘ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ నవ్వులతో పాటు కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
హీరో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా కలిసి నటించిన చిత్రం “రంగ రంగ వైభవంగా”. ఈ చిత్రం సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ” 2020-21 లో మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు నా విధిరాత అలా ఉంది. అనగానే అభిమానులు ఒక్కసారిగా అరవడం ప్రారంభించారు.
దీంతో తేజ్ అరేయ్ ఆగడ్రా బాబు.. నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్ అసలే మతిమరుపు.. మీ అరుపులకు ఈ కొంచం కూడా మర్చిపోతా. అంటూనే.. నా తమ్ముడు ఉప్పెన మూవీతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్.. అదీ కాక నా తమ్ముడు వైష్ణవ్ ను మీరు ఆదరించారు అదే నాకు సంతోషం అని అన్నారు. దీంతో అభిమానులు అన్నా ఐ లవ్ యూ అని అరవగా.. అరేయ్ అబ్బాయిలు అంటే ఎలారా? అమ్మాయిలు అనాలి గాని అని నవ్వులు పూయించారు. ఇక తన యాక్సిడెంట్ గురించి తలచుకుని ఎమోషనల్ అయ్యారు. నాకు ప్రమాదం జరిగాక నా తమ్ముడు వచ్చినన్ను పలిచినా నేను పలికే స్థితిలో లేను అని ఉద్వేగానికి లోనయ్యారు.
నాకు అమ్మా.. నాన్న.. అందరూ ఉన్నారు. కానీ నాతమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. వాడే నాబలం.. నా ధైర్యం అని అన్నారు. అరేయ్ నేనేమి 90 వేసి రాలేదు.. నాకు నిజంగా తాగటం అలవాటు లేదు అని నవ్వులు పూయించారు. అలాగే మీరందరూ బైక్ పై ప్రయాణాలు చేసేప్పుడు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి అని అభ్యర్థించాడు. ప్రస్తుతం తేజ్ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ప్రమాదం తర్వాత ఇలా ఈవెంట్ కు వచ్చి తేజ్ మాట్లాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.