హీరోలే కాదు హీరోయిన్స్ సిస్టర్స్ కూడా సినిమాల్లోకి వచ్చిన.. వస్తున్న సంగతి విదితమే. ఆర్తి అగర్వాల్ సోదరి..అదితి అగర్వాల్.. అక్క బాటలోకి సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ అంతగా క్లిక్ కాలేదు. అలాగే కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా అంతే. అడపా దడపా సినిమాలతో అలరించింది. ఇప్పుడు మరో స్టార్ నటి సాయి పల్లవి సోదరి కూడా సినిమాల్లోకి వచ్చింది. అయితే ఆమెనుద్దేశించి వ్యాఖ్యలు చేసిందీ సాయి పల్లవి.
సినీ పరిశ్రమలో వారసత్వం కామన్. ఓ నటుడు స్టార్ హోదాకు వచ్చాక.. అతడి కుటుంబం నుండి వారసులు వస్తూనే ఉంటారు. అయితే హీరోయిన్స్ విషయంలో వస్తారు కానీ సక్సెస్ కావడం చాలా అరుదు. ముఖ్యంగా హీరోయిన్స్ అన్న, తమ్ముడే లేదంటే చెల్లెలు కూడా ఈ పరిశ్రమలోకి అడుగు పెట్టి.. తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే గతంతో పోలిస్తే.. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ సిస్టర్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఆర్తి అగర్వాల్ సోదరి..అదితి అగర్వాల్.. అక్క బాటలోకి సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ అంతగా క్లిక్ కాలేదు. అలాగే కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా అంతే. అడపా దడపా సినిమాలతో అలరించింది. ఇప్పుడు మరో స్టార్ నటి సాయి పల్లవి సోదరి కూడా సినిమాల్లోకి అడుగిడింది. అయితే ఇప్పుడు సోదరిని ఉద్దేశించి సాయి పల్లవి చేసిన పోస్టు చర్చనీయాంశమైంది.
నచ్చిన సినిమాలే చేస్తూ.. వ్యక్తిగత జీవితాన్ని ఆనందిస్తూ గడిపే హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన ఆణిముత్యాల్లో ఒకరు సాయి పల్లవి. కోట్లు ఇస్తానన్న నచ్చని పని చేయని ఆమె వ్యక్తిత్వానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నదీ.. ఇప్పుడు సోదరి పూజా కన్నన్ ఉద్దేశించి ఇంట్రస్టింగ్ పోస్టు ఒకటి చేసింది. అందేంటంటే..‘హ్యాపీ బర్త్ డే మై మంకీ.. మంచి సోదరి కావాలనే తపనతో, నువ్ నన్ను మంచి మనిషిగా మార్చావ్.. నువ్ నాకు ఎన్నో మంచి విషయాలు నేర్పావ్.. థాంక్యూ చెల్లె.. నువ్వే నా వెలుగు, నా ప్రేమ, నా సంతోషానివి.. ఐ లవ్యూ.. అని సాయి పల్లవి విషెస్ చెబితే..పూజా కన్నన్ ఇలా రిప్లై ఇచ్చింది. ఓ మై గాడ్.. ఐ లవ్యూ సో మచ్.. ఐ మిస్ యూ’ అంటూ ఎమోషనల్ అయింది.
పూజా కన్నన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ.. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో రూపంలో పొందు పరిచింది. తొలుత సాయి పల్లవి తన సోదరి ఫోటోలు పెట్టినప్పుడు.. అంతా ట్విన్ సిస్టర్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత తను నా చెల్లి అంటూ క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా తానేనని పలు మార్లు చెప్పిన సంగతి విదితమే. కాగా, అక్క బాటలోనే పూజా కన్నన్ కూడా సినిమాల్లోకి వచ్చింది. తమిళంలో ఓ సినిమాను చేసింది. అది అంతగా క్లిక్ అవ్వలేదు. దీంతో పూజ కన్నన్ సినిమాల విషయంలో వెనక్కి తగ్గినట్టు అనిపిస్తోంది. ఇటు సాయి పల్లవి తదుపరి సినిమా ఏంటో కూడా ఇంకా ఎనౌన్స్ రాలేదు.