Sai Pallavi: ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘సాయి పల్లవి’ హవా నడుస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా ఆమె నటనకు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. సుకుమార్ ఏకంగా ఆమెకు లేడీ పవన్ కల్యాణ్ అని బిరుదుగా కూడా ఇచ్చేశారు. ఇక అప్పటినుంచి అభిమానులు ఆమెను లేడీ పవర్ స్టార్ అని పిలవటం మొదలుపెట్టారు. ఆ పేరుకు తగ్గట్టుగా సాయి పల్లవి తన నటన, యాటీట్యూడ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నటించిన ‘విరాట పర్వం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో సాయి పల్లవి ఏవీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎందుకంటే అందులో ఆమె ఇంట్రడక్షన్ లేడీ పవర్ స్టార్ అని మొదలవటం.. తన ఏవీలో లేడీ పవర్ స్టార్ అని పడగానే సాయి పల్లవి ఆశ్చర్యానికి గురవ్వటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏవీలో లేడీ పవర్ స్టార్ అని పడ్డప్పుడు ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్ల మనసును దోచుకుంటోంది. ఆ టైటిల్ సాయి పల్లివికి సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ సినిమా తూము సరళ అనే మహిళా నక్సలైట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
సరళ జీవితాన్ని ఓ సినిమా కథలా మార్చి తెరకెక్కించారు దర్శకుడు వేణు ఉడుగుల. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం వరంగల్‌లో ‘ఆత్మీయ వేడుక’ జరిగింది. రానా, సాయి పల్లవి, వేణు ఉడుగుల ఇతర టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సినిమా టీం మొత్తం తూము సరళ ఇంటికి వెళ్లింది. సినిమా టీంకు సరళ కుటుంబసభ్యులనుంచి ఘన స్వాగతం లభించింది. సరళ పాత్రలో నటించిన సాయి పల్లవిని చూసి సరళ అమ్మగారు భావోధ్వేగానికి గురయ్యారు. మరి, తన AVలో లేడి పవర్ స్టార్ అని చూడగానే సాయి పల్లవి ఇచ్చిన రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sai Pallavi: సాయిపల్లవికి బిగ్ షాక్.. ‘విరాట పర్వం’ చూడబోమంటూ నెటిజన్స్ ఫైర్!