నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డెబ్యూ మూవీ నుండే వరుస విజయాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా అందరి మనసులు గెలుచుకుంది. ఇప్పటివరకూ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. స్టార్డమ్ మాత్రం వేరే లెవెల్ లో సొంతం చేసుకుంది. సాయిపల్లవి సినిమా వస్తుందంటే చాలు.. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సాయిపల్లవి నేచురల్ యాక్టింగ్, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ తో మెగాస్టార్ ని సైతం మెస్మరైజ్ చేసింది.
బేసిగ్గా సాయిపల్లవి మెగాస్టార్ చిరుకి, ఆయన గ్రేస్ ఫుల్ డాన్స్ కి వీరాభిమాని అని పలుమార్లు బయటికి చెప్పింది. కానీ.. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే.. నో చెప్పి అందరికీ షాకిచ్చింది. మెగాస్టార్ సినిమాకు సాయిపల్లవి నో చెప్పడం ఏంటని గతంలో వార్తలు కూడా హల్చల్ చేశాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి.. మెగాస్టార్ సినిమా అవకాశం గురించి, అసలు జరిగిందేంటనే విషయాలను బయటపెట్టింది.
మెగాస్టార్ పాటలకు డాన్స్ చేసే సాయిపల్లవి.. ఆయన సినిమాలో అవకాశం ఇస్తే వద్దని చెప్పారంట. ఎందుకు? అని అడిగిన ప్రశ్నకు స్పందించిన సాయిపల్లవి.. “చిన్నప్పటి నుండి చిరంజీవి గారి సినిమాలు, పాటలు, డాన్సులు చూస్తూ పెరిగాను. ఎన్నోసార్లు ఆయన పాటలకు డాన్స్ చేసేందుకు ట్రై చేశాను. కానీ.. ఎప్పుడూ ఆ గ్రేస్ కుదరలేదు. ఇక నేను భోళాశంకర్ సినిమా ఒరిజినల్ వెర్షన్ వేదాళం చూశాను. అదీగాక నాకు రీమేక్ సినిమాల రోల్స్ చేయడం నచ్చదు. ఎందుకంటే.. ఆల్రెడీ వేరేవాళ్లు చేసిన పాత్రను చేస్తే కంపేర్ చేసి చూస్తారు. అందుకే ఆ సినిమాకు నో చెప్పాను. కానీ.. చిరంజీవి గారి సినిమాను వదులుకోవాలని కాదు. తర్వాత ఆయన స్టేజిపై నేను ఒప్పుకుంటే బాగుండని చెప్పినప్పుడు బాధగా అనిపించింది” అని చెప్పింది. మరి ప్రస్తుతం సాయిపల్లవి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి సాయిపల్లవి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.