సాధారణంగా ఒక భాషలో నటించే హీరోయిన్లకు వేరే భాషలో క్రేజ్ రావడం అనేది చాలా అరుదు. అలాంటి క్రేజ్, ఆ స్థాయి అభిమానం సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. మలయాళంలో ప్రేమమ్ అనే సినిమాతో అక్కడ ఎంత క్రేజ్ తెచ్చుకుందో.. అదే సినిమాతో తెలుగులో కూడా అంత పాపులారిటీ దక్కించుకుంది. సాయిపల్లవి తెలుగులో ఫిదా సినిమాతో అడుగుపెట్టింది. కానీ అంతకుముందే ఆమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి అంటే.. ఓ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే ఓ ఎమోషన్ అనేంతలా అభిమానులకు దగ్గరైంది. ఈ అమ్మడు కెరీర్ విషయంలో ఎంత కూల్ గా ఉంటుందో.. సినిమాల విషయంలో అంత సెలెక్టివ్ గా ఉంటుంది. అందుకే సాయిపల్లవి నుండి గ్లామర్ కి స్కోప్ ఉన్న సినిమాలు కాకుండా నటనకు ఆస్కారం ఉన్న సినిమాలే వస్తుంటాయి. ఆమె కూడా అలాంటి సినిమాలకే ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పుడు విరాటపర్వం సినిమాతో మనముందుకు రాబోతోంది. ఈ క్రమంలో సాయిపల్లవి ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఎప్పుడు రాజకీయ వార్తలతో బిజీగా ఉండే ఆర్కే.. సాయిపల్లవిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాత్రం.. చాలా కూల్ గా కనిపించారు. అసలు ఆర్కేతో ఇంటర్వ్యూ అంటే వచ్చిన గెస్ట్ తప్పకుండా కంగారు పడుతుంటారు. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం అలా ఉంటుంది మరి. అలాంటి ఆర్కేతో, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి మొదట కాస్త కంగారుపడినా .. తరువాత సరదాగా ముచ్చటించింది. ఆర్కే రొటీన్ కి భిన్నంగా ఈ ఇంటర్వ్యూ సాగడం గమనార్హం. సాయి పల్లవి కి తెలుగు లో ఎంత క్రేజ్ ఉందో చెప్తూనే.. తెలుగు అబ్బాయి ని వివాహం చేసుకుంటారా? అని ప్రశ్నించారు. అందుకు సాయి పల్లవి కూడా మా నాన్న కూడా ఇదే మాట అంటారు అని చెప్పుకొచ్చింది.
అలాగే.. ‘తనకు 23 ఏళ్ళ వయసులో పెళ్ళై.. 30 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారని అనుకున్నాను’ అంటూ ఆశ్చర్యపరించింది. ఆ తరువాత కూడా వీరిద్దరి సంభాషణ చాలా సరదాగా సాగింది. సాయి పల్లవి ఎడ్యుకేషన్ గురుంచి, ఆమె డాన్స్ గురుంచి పలు విషయాలు ప్రస్తావించాడు హోస్ట్. ఇక.. ఇండస్ట్రీ అనే గ్లామర్ ప్రపంచం లో ఇంత పద్దతిగా ఉండి కూడా విజయం సాధించవచ్చనే దానికి మీరు ఉదాహరణగా నిలిచారు.. ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు ‘నాకు కంఫర్ట్ లేకపోతే చెయ్యను.. వెళ్లి చదువుకోవడం చేస్తాను అన్న నమ్మకం నాకుంది.. దానికే కట్టుబడి ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది. ఇక సాయి పల్లవికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ఆర్కే సాయి పల్లవికి చాక్లెట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.