స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేవలం తెలుగు, తమిళ, మలయాళ భాషల సినిమాలతోనేపాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె తెరపై కనిపించినా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఫ్యాన్స్ కి పండగే. అయితే.. సాయిపల్లవి గురించి ఎప్పటికప్పడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం ఫ్యాన్స్ అందరిలో ఎల్లప్పుడూ కనిపిస్తుంటుంది.
ఇక తమిళ బ్యూటీ అయినటువంటి సాయిపల్లవి.. తెలుగు ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో తెలిసిందే. తాజాగా సాయిపల్లవి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి ప్రస్తుతం ప్రోమో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తన పెళ్లి, కెరీర్ విషయాలను షేర్ చేసిన సాయిపల్లవి.. ‘బేసిగ్గా ఇంట్లో బడగ మాట్లాడేటప్పుడు నాకు మధ్యలో తెలుగు వస్తుంటుంది. అప్పుడు మా నాన్నగారు ఎవరైనా తెలుగు అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొమ్మని అంటుంటారు’ అని చెప్పింది.
ఇక తనకు 23 ఏళ్ళ వయసులో పెళ్ళై.. 30 వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారని అనుకున్నానని చెప్పి షాకిచ్చింది. అనంతరం మెగాస్టార్ చిరంజీవి డాన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. ఆయన నటించిన ముఠామేస్త్రిలోని ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ సాంగ్ లో ఐకానిక్ స్టెప్ ని నేను చాలా సార్లు ట్రై చేశాను. కానీ ఆయనలా మాత్రం చేయలేకపోయాను. అలాగే ‘నడక కలిసిన నవరాత్రి’ సాంగ్ లో మెగాస్టార్ గ్రేస్ అయితే చాలా ఇష్టం. అది ఎవరికీ రాదు” అని చిరు డాన్స్ పై కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సాయిపల్లవి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సాయిపల్లవి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.