నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గార్గి తర్వాత మరో సినిమా చేయలేదు సాయి పల్లవి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన తదుపరి సినిమా విషయమై మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
హీరోయిన్లు స్క్రీన్ మీద అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాల్సిందే. ఇక దాంతో పాటు ఫాలోయింగ్ సంపాదించాలంటే అందాలు చూపించాల్సిందే. ఇంత చేసిన పాపులారిటీ వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ సాయి పల్లవి మాత్రం హీరోయిన్లందరికీ భిన్నం. ఎక్స్ పోజింగ్ చేయకుండా నాచురల్ గా ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మంచి పాత్రలు ఎంచుకుంటూ తనకిచ్చిన పాత్రకు ప్రాణం పోస్తుంది ఈ బ్యూటీ. అవసరం లేకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో దర్శనమిచ్చే ఈ రోజుల్లో హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఎక్స్ పోజింగ్ కి అవకాశమే లేదని చెబుతుంది. కేవలం తన యాక్టింగ్, మంచితనంతోనే భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా.. సాయి పల్లవి క్రేజ్ కి వచ్చిన నష్టం ఏమి లేదు.
నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన సాయి పల్లవి.. ఏ సినిమాలో కూడా ఎక్స్ పోజింగ్ కి అవకాశమే ఇవ్వలేదు. ఈ లక్షణమే ఈ అమ్మడిని మరో స్థాయిలో నిలబెట్టింది. స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చినా.. పాత్ర నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పే ధైర్యం సాయి పల్లవికి మాత్రమే సాధ్యం. సాయి పల్లవికి ఇమేజ్ కన్నా తనకు నచ్చిన పాత్ర చేయడం అంటేనే ఇష్టమని చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సాయి పల్లవి సినిమా చేయడానికే భయపడుతుంది. దీనికి కారణం ఏంటో తెలిస్తే సాయి పల్లవిని అభినందించకుండా ఉండలేము.
సాయి పల్లవి చివరిగా నటించిన సినిమా గార్గి. ఈ సినిమా తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కనీసం మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఇక గతంలో ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఊహించని విధంగా ప్లాప్ లుగా నిలచాయి. ఈ కారణం గానే సాయి పల్లవి మరో సినిమా చేయడం లేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన తదుపరి సినిమా విషయమై మాట్లాడుతూ.. “సినిమా అనేది నిర్మాతలను కాపాడాలి.. కానీ నావల్ల కొందరు నిర్మాతలు అప్పలపాలవుతున్నారు.. అది నాకు ఇష్టం లేదు .అయినప్పటికీ వారు మళ్ళీ నాతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. కానీ నేను మాత్రం వారిని ఇబ్బంది పెట్టను. వారిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాకుండా వేరే మంచి సినిమాల్లో అవకాశాలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తాను” అంటూ క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. ఇదిలా ఉండగా.. సాయి పల్లవి ఇన్ని రోజులు సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం ఇదేనని అర్ధం అవుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.