Sai Pallavi: కాశ్మీరీ పండిట్ల హత్యలను, గోవులను అక్రమ రవాణా చేసే ఓ మతానికి చెందిన వ్యక్తిని కొట్టడాన్ని ఒకటే అంటూ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గో హత్యలు చేసే వారిని కాశ్మీరీ పండిట్లతో పోల్చటం ఏంటంటూ ఓ వర్గం సాయి పల్లవిపై మండిపడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై పెద్ద రచ్చ మొదలైంది. సాయి ‘పల్లవి విరాట పర్వం’ సినిమాను బాయ్‌కాట్ చేయాలనే వరకు ఈ వివాదం వచ్చింది. ఈ నేపథ్యంలో సాయి పల్లవికి సంబంధించిన విషయాలను నెటిజన్లు సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. సాయి పల్లవి తమిళనాడుకు చెందిన బడగ జాతికి చెందిన యువతని తెలిసిందే. మరి, ఆ బడగ జాతి ఏంటి? ఆ జాతి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? అన్న విషయాలను నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ సాయి.. సాయి పల్లవి వంశ చరిత్రపై ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె వంశ చరిత్రను వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ వీరిది తమిళనాడులోని నీలగిరిలో ఉన్న కోటగిరి ప్రాంతం. వాస్తవానికి వీరి సామాజిక వర్గాన్ని ‘బడగాస్’ అంటారు. బడగ అంటే కన్నడలో ఉత్తరం అని అర్థం. తమిళనాడులోని నీలిగిరి ప్రాంతానికి ఉత్తరంగా ఉండే మైసూరు ప్రాంతంనుంచి వలస వచ్చారు. ఏంటి అసలు గొడవ అంటే?… టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి మతం మారని వారిని చంపేస్తున్న నేపథ్యంలో బారీ ఎత్తున గొరిల్లా పద్దతి యుద్ధంతో టిప్పు సైన్యాన్ని ముప్ప తిప్పలు పెట్టిన హిందూ అధికారులే ఈ బడగాస్. టిప్పు సుల్తాన్ మంత్రి పూర్ణయ్య, కోశాధికారి క్రిష్ణారావు, శ్యాం అయ్యంగార్ వెన్నుపోటు పొడవటంతో అడవుల్లో తల దాచుకున్న ఒక వీర తెగ బడగ తెగ.
ఒక్క బడగ వీరుడు.. 20 మంది టిప్పు సుల్తాన్ దుర్మార్గులకు చావు రుచి చూపించినటువంటి రోజులు. వీళ్ల దెబ్బకు టిప్పు సుల్తాన్ సైన్యం మొత్తం మెడకు ఇనుప పట్టీలు వేసుకుని తిరిగేదంట. ఎందుకంటే.. వీళ్లు ఒక్క సారిగా మెరుపు దాడి చేసి తల నరికేసుకుంటూ వెళ్లే వారంట. వీరి పోరాటంలో చురకత్తులు వాడేవారు. నాట్యంలో కూడా మెరుపు తీగలు. అదే జీన్స్ సాయి పల్లవికి వచ్చింది. 1951వరకు వీరికి ఎస్టీ హోదా ఉండేది. తర్వాత బీసీలుగా మార్చబడ్డారు. వీరి అరణ్యవాసానికి ముఖ్యకారణం అయినవాడు టిప్పు సుల్తాన్. కాశ్మీరీ పండిట్ల లాంటి సంఘటనలు చరిత్రలో వందలు, వేలు ఉన్నాయి. సాయి పల్లవి కుటుంబం ఊటి నుంచి బయటకు వచ్చి కోయంబత్తూరులో సెటిల్ అయింది. ఆమె చేసిన వ్యాఖ్యల ఇప్పుడు ఆమె జీవిత చర్రితను బయటకు తీసుకొస్తున్నారు’’ అని అన్నారు. మరి, సాయి పల్లవి వంశ చరిత్రపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bigg Boss Telugu: బిగ్ బాస్ సిజన్ 6లోకి రియల్ వకీల్ సాబ్.. ఎవరీ సుబ్బు సింగ్ పోగు?