యూత్ ఆడియెన్స్‌లో మంచి గుర్తింపు ఉన్న హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అందరికీ నచ్చే సినిమాల్లో ఆయన నటిస్తుంటారు. సాయి తేజ్ యాక్ట్ చేసిన కొత్త చిత్రం ‘విరూపాక్ష’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్స్ బ్యాచిలర్స్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు. నటనతో పాటు డ్యాన్సులు, లుక్స్‌తోనూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్నారాయన. కెరీర్లో దూసుకెళ్తున్న సమయంలో బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి గురి కావడంతో కొన్నాళ్లు ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే మళ్లీ జోరు పెంచారు సాయి తేజ్. ఆయన నటించిన ‘విరూపాక్ష’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీని స్టార్ డైరెక్టర్ సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 21న ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
‘విరూపాక్ష’ ట్రైలర్‌కు మంచి ఆదరణ దక్కింది. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో హైప్ పెంచేసింది. సాయితేజ్ కొంత గ్యాప్ తర్వాత రానుండటంతో ఆయన్ను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. మూవీ రిలీజ్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో ‘విరూపాక్ష’ చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది. ఈ సినిమా టీమ్ రీసెంట్గా ప్రముఖ టెలివిజన్ షో ‘జబర్దస్త్’లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో తాజాగా విడుదలైంది. ఇందులో యాంకర్ సౌమ్యపై పంచుల మీద పంచులు వేస్తూ ఆకట్టుకున్నారు సాయి ధరమ్ తేజ్.
‘జబర్దస్త్’ షోకు సాయి ధరమ్ తేజ్‌తో పాటు హీరోయిన్ సంయుక్తా మీనన్, మూవీ డైరెక్టర్ కార్తీక్ దండు కూడా పాల్గొన్నారు. సంయుక్త చీరలో షోకు రాగా.. సాయి తేజ్ పంచకట్టులో మెరిశారు. వీరు పాల్గొన్న ‘జబర్దస్త్’ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆద్యంతం నవ్వులతో ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది. షోకు ఏంజెల్స్ రావడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా అంటూ సాయి తేజ్ అన్నారు. తనను అన్నారేమోనని యాంకర్ సౌమ్య అనుకున్నారు. కానీ మిమ్మల్ని కాదంటూ మెగా మేనల్లుడు జోక్ చేశారు. రీటేక్‌లు ఎవరు ఎక్కువగా తీసుకున్నారంటే.. డైరెక్టర్ అంటూ మరోసారి పంచ్ వేశారు సాయి తేజ్. ప్రోమో చివర్లో పవన్ సార్, ధర్మరాజ్ సర్ అంటూ సౌమ్య పిలవగా.. ఇంకా నయం, యమ ధర్మరాజు అనలేదంటూ నవ్వులు పూయించారు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రోమో మీరు చూశారా? మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.