మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత సినిమా ఈవెంట్ లో మెరిశారు. మెగాస్టార్, పవర్ స్టార్ బాటలో నడుస్తూ.. అటు సినిమాల పరంగా, ఇటు పర్సనాలిటీ పరంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అందరితోనూ ఎంతో స్నేహంగా మెలిగే తేజ్.. చిన్న, పెద్ద ఏ హీరో తమ ఈవెంట్ కి ఆహ్వానించినా వచ్చి.. సపోర్ట్ చేస్తుంటాడు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సాయిధరమ్ తేజ్ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో సినిమా టీమ్ కి విషెస్ చెబుతూనే.. ఒకానొక క్షణంలో ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం తేజ్ ఫైర్ అయిన మాటలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ.. “ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఇదివరకే కిరణ్ నన్ను చాలా ఈవెంట్స్ కు పిలిచాడు. కానీ రాలేకపోయాను. ట్రైలర్ కొత్తగా ఉంది. కాకపోతే నాకు లక్ రాలేదు. నాకు అంత కాంట్రవర్సీలు లేవు. ఇక చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్’ అన్నాడు తేజ్. అదే సమయంలో ఫ్యాన్స్ ‘అన్నా పెళ్లి ఎప్పుడు?’ అని అరిచారు. వెంటనే రియాక్ట్ అయిన తేజ్..”చెప్తా.. మీరెప్పుడైతే అమ్మాయిలను రెస్పెక్ట్ చేస్తారో అప్పుడు.. అది మీ వల్ల అవుద్దా..?” అని ఫైర్ అయ్యాడు. ఇంకా కంటిన్యూ చేస్తూ.. ‘పెళ్లి ఎవ్వడు రా.. ముందు మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. పెళ్లి ఎప్పుడో అయిపోయింది. నాలుగు సార్లు అయ్యింది పెళ్లి’ అని సరదాగా చెప్పుకొచ్చాడు. మరి తేజ్ రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.