నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొని నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. దీంతో వెంటనే తారకరత్నను హుటాహుటిన బెంగుళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే శనివారం వైద్యులు తారకరత్న హెల్త్ బులిటెన్ ను కూడా విడుదల చేశారు. తారకరత్నం ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రస్తుతం అతనికి ఎక్మో ద్వారా చికిత్స అందిస్తామని, ఆయన ఆరోగ్యంపై 10 మంది వైద్యులం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు.
ఇక ఉన్నట్టుండి తారకరత్న గుండెపోటుకు గురికావడంతో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే తారకత్న ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తారకరత్న త్వరగా కోలుకోని తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక ఇతనితో పాటు నందమూరి కల్యాణ్ రామ్ సైతం తారకరత్నం ఆరోగ్యంపై ట్విట్ చేయగా.. తాజాగా నటుడు సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్ చేశారు. తారకరత్న అన్న… మీరు త్వరగా కోలువాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేవాడు. అయితే ఉన్నట్టుండి తారకరత్న గుండెపోటుకు గురికావడంతో అతని కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తారకత్న త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Disheartening to know this.
Wishing a speedy recovery for #TarakaRatna Anna.
Keeping you in all our prayers that you come back healthy & stronger 🙏
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 28, 2023