Vishwak Sen: సినీ పరిశ్రమనుంచి విశ్వక్ సేన్‌కు మద్దుతుగా నిలిచే వారి సంఖ్య పెరుగుతోంది. మీడియా డిబేట్‌లో వివాదం విషయంలో నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. కొందరు ఇన్‌డైరెక్ట్‌గా విశ్వక్‌ను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా, సాయిధరమ్ తేజ్, సిద్ధు జొన్నల గడ్డ ఆ జాబితాలోకి చేరారు. గురువారం వీరిద్దరు విశ్వక్ సినిమా ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’’పై ట్వీట్లు చేశారు. సినిమా అద్భుతంగా ఉందని, విశ్వక్ నటన ఆకట్టుకుందంటూ పోస్టులు పెట్టారు. సాయిధరమ్ తేజ్ తన ట్వీట్‌లో… ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా వినోదం, భావోద్వేగాల కలయికగా ఉంది. నాకు బాగా కనెక్ట్ అయింది. ఎంజాయ్ చేశా. అర్జున్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. బాపినీడు అన్న, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, రుక్సార్ థిల్లాన్, సినిమా టీంకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ తన ట్వీట్‌లో.. ‘‘ అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు నా ముఖంలో నవ్వు చెదరలేదు. రచన, నటన అద్భుతంగా ఉంది. సినిమా చాలా క్యూట్‌గా ఉంది. టీం అందరికీ శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. కాగా, విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమాకు విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల మందుకు రానుంది. మరి, సాయిధరమ్ తేజ్, సిద్ధు ట్వీట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#AshokaVanamLoArjunaKalyanam is a rush of Entertainment & Emotions that I enjoyed so much relating myself.@VishwakSenActor Your transformation and living in the role of Arjun 👏🏼👏🏼
Congratulations#BapineeduB anna @BvsnP Garu @RuksharDhillon @SVCCofficial @SVCCDigital and team pic.twitter.com/2cotAIhQFJ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 5, 2022
#AVAK Is a Beautiful film with a lot of heart in it. I had a smile through out on my face . Honest writing and genuine performances. Very Very Cute !Congratulations to the entire team. @VishwakSenActor @RuksharDhillon @BvsnP @sudheer_ed @storytellerkola @vidya7sagar @jaymkrish
— Siddhu Jonnalagadda (@Siddu_buoy) May 4, 2022
ఇవి కూడా చదవండి : Vishwak Sen: రెండేళ్లలో బాలీవుడ్‌లో అడుగుపెడతా: విశ్వక్ సేన్