ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డులు కొల్లగొడుతూ.. ఆస్కార్ బరిలో దూసుకెళ్తోంది నాటు నాటు సాంగ్. ఇక ఈ సాంగ్ పై తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రముఖ ఆద్యాత్మిక గురువు సద్గురు.
RRR.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నిలిచి.. ఇండియన్ సినిమా, తెలుగు సినిమా స్థాయి ఏంటో నిరూపించిన సినిమా. దర్శక దీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో తమ నట విశ్వరూపాలనే చూపారు రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు. ఇక ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టి ఆస్కార్ వైపు దుసుకెళ్తోంది. ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పాటకు సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేశాడు ప్రముఖ ఆద్యాత్మిక గురువు సద్గురు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్.. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ బరిలో నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పాటకు తాజాగా ఇండియాలో ఉన్న సౌత్ కొరియా ఎంబసీ దౌత్య అధికారులు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఆ డ్యాన్స్ కు ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఈ నేపథ్యంలోనే నాటు నాటు సాంగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ ఆద్యాత్మిక గురువు సద్గురు. సౌత్ కొరియన్స్ చేసిన ఈ డ్యాన్స్ వీడియోను సద్గురు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.”నాటు నాటు పాటకు ప్రస్తుతం ప్రపంచం మెుత్తం తాండవం చేస్తోంది” అంటూ ఆయన రాసుకొచ్చారు. అదే విధంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటుగా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశాడు. మరి నాటు నాటు సాంగ్ కు సద్గురు సైతం స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
World dances to Naatu Naatu! Congratulations to the #RRR team and to the Ambassador of the Republic of Korea & his team for shaking their leg to Naatu Naatu! -Sg @RokEmbIndia@AlwaysRamCharan @tarak9999 @ssrajamouli https://t.co/s2MWiSEpai
— Sadhguru (@SadhguruJV) February 28, 2023