సాధారణంగా సింగర్స్.. తెర వెనక ఉంటారు. కానీ 'పుష్ప'లో సామీ సామీ పాటతో ఫేమ్ తెచ్చుకున్న లేడీ సింగర్ మాత్రం ఏకంగా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అవును మీరు విన్నది నిజమే. ‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ ఎంత ఫేమస్ అయ్యాడో.. ‘సామీ సామీ’ పాట కూడా ఓవరాల్ గా
ప్రేక్షకుల నుంచి అలాంటి క్రేజ్ నే సొంతం చేసుకుంది. ఇప్పటికీ హీరోయిన్ రష్మిక ఏ ఈవెంట్ కి వెళ్లినాసరే ఈ పాటకు కచ్చితంగా ఓ స్టెప్ అయినా వేయాలని అడుగుతుంటారు. హీరోహీరోయిన్ మాత్రమే కాదు.. ఈ సాంగ్ పాడిన సింగర్ కూడా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా హీరోయిన్ అయిపోయింది. త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి కూడా రానుందండోయ్. ఇంతకీ ఏంటి విషయం?
అసలు విషయానికొచ్చేస్తే.. యాక్టింగ్ ఛాన్స్ కి వయసుతో సంబంధం లేదని సింగర్ రాజ్యలక్ష్మి ప్రూవ్ చేసింది. గతంలో ఓ టీవీ ఛానెల్ లో విన్నర్ గా నిలిచిన సెంథిల్, రాజ్యలక్ష్మి దంపతులు.. ఆ తర్వా ఇండస్ట్రీలోకి సింగర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ‘పుష్ప’తోపాటు పలు సినిమాల్లో పాటలు పాడిన ఈమె ఇప్పుడు ‘లైసెన్స్’ మూవీలో హీరోయిన్ గా నటించింది. త్వరలో ఈ చిత్రం థియేట్లలోకి కూడా రానుంది. అయితే పూర్తిస్థాయిలో తీసిన తమిళ చిత్రం మాత్రమే. తాజాగా ఆదివారం చెన్నెలో ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
’32 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లల తల్లిని నేను. అలాంటిది హీరోయిన్ గా చేస్తానని అస్సలు ఊహించలేదు. డైరెక్టర్ ఫోన్ చేసి ‘లైసెన్స్’ స్టోరీ చెప్పారు. మొత్తం విన్న తర్వాత ఇందులో నేను ఏం చేయాలి అని అడిగాను. మీరే హీరోయిన్ అని చెప్పారు. దీంతో నేను యాక్ట్ చేయగలనా అని అనుకున్నారు. డైరెక్టర్ పక్కా క్లారిటీగా ఉండేసరికి నేను నటించేశాను. అలా ఈ సినిమాలో భాగమయ్యాను’ అని సింగర్ రాజ్యలక్ష్మి చెప్పుకొచ్చారు. సో అదనమాట విషయం. మరి ‘పుష్ప’ సింగర్ హీరోయిన్ కావడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.