ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘పుష్ప’. ఆ సినిమా రెండు పార్టుల్లో వస్తుంది అన్న విషయం తెలియగానే అభిమానుల్లో అంచనాలు ఎంతగానో పెరిగిపోయాయి. అంతేకాకుండా ఆ సినిమా ఏ అప్‌డేట్ వచ్చినా అది సినిమా అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన బన్నీ, రష్మిక లుక్స్ కానివ్వండి.. పాటలు కానివ్వండి ప్రేక్షకులను ఊపేస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ రానే వచ్చింది. ‘సామీ సామీ’ లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్ర బృందం.
ఆ సాంగ్‌లో దేవీశ్రీ మార్క్ మ్యూజిక్‌తోపాటు, శేఖర్ మాస్టర్ మార్క్ స్టెప్పులు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో ముఖ్యంగా రష్మిక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే చెప్పాలి. మాస్ లుక్‌లో రష్మిక స్టెప్పులు, ఫోజులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్ సాహిత్యం ఈ సాంగ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. మౌనిక యాదవ్ ఆలపించిన తీరు కూడా ఎంతో క్యాచీగా ఉంది. యూట్యూబ్‌ను షేక్ చేయడానికి పుష్ప నుంచి మరో సాంగ్ వచ్చింది అనడంలో సందేహం లేదు. మరి ఆ సాంగ్‌ను మీరూ చూసేయండి.