ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తీవ్ర అనారోగ్యానికి గురైంది. చేతికి సెలైన్ బాటిల్ సూది గుచ్చి ఉండటంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అసలు విషయం తెలిసిన తర్వాతే కాస్త కుదురుకున్నారు.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అంటే కొందరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ ‘RX 100’ హీరోయిన్ ఇందు అంటే మాత్రం చాలా ఫాస్ట్ గా గుర్తుపట్టేస్తారు. ఫస్ట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో కలిసి మూవీ చేసినప్పటికీ హిట్ కొట్టలేకపోయింది. దీంతో మెల్లమెల్లగా టాలీవుడ్ నుంచి కనుమరుగైపోతూ వచ్చింది. ప్రస్తుతానికైతే తెలుగులో ఒకటి, తమిళంలో రెండు మూవీస్ చేస్తోంది. ఇవి కాకుండా వేరే భాషలోనూ నటిస్తూ బిజీగా ఉంది. అలాంటి ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది.
ఇక విషయానికొస్తే.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తెలుగులో చేసిన సినిమాలు తక్కువ కావొచ్చేమో గానీ క్రేజ్ మాత్రం చాలానే సంపాదించింది. సినిమాల్లో హాట్ గా కనిపించే పాయల్.. ఇన్ స్టాలో ఫొటోలు, వీడియోల్లో అంతకు మించి అనేలా దర్శనమిచ్చేది. అయితే సడన్ గా ఇప్పుడు తనకు హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నట్లు చెప్పింది. అందుకు సంబంధించి రెండు ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇందులో చేతికి సూది గుచ్చుకుని సెలైన్ ఎక్కించుకున్నట్లు కనిపించింది. దీంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. ఆమె సమస్య గురించి తెలుసుకుని పర్వాలేదులే తగ్గిపోతుందని భరోసా ఇస్తున్నారు.
‘నా వరకు అయితే నేను చాలా తక్కువగా నీరు తాగేదాన్ని. దీంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫలితంగా అనారోగ్యం బారినపడ్డాను. ప్రస్తుతానికైతే చికిత్స పూర్తయింది. యాంటీ బయోటిక్స్ చివరి డోస్ తీసుకున్నాను. మళ్లీ కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీగా ఉన్నాను. అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించాలి. నా కొత్త ప్రాజెక్టు కోసం షూటింగ్ ని ఆపలేకపోయాను. ఈసారి ఇంతకు ముందు కంటే షో అద్భుతంగా ఉంటుంది. మీరందరూ కూడా వాటర్ తాగి మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి. టేక్ కేర్’ అని పాయల్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి పాయల్ కు కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.