ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు అప్పుడప్పుడు ఒకరి చేతిలో నుండి వేరొకరి చేతుల్లోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పటిదాకా అలా ఎన్నో సినిమాల విషయాలలో జరిగినట్లు స్వయంగా ఆయా దర్శకులు, నిర్మాతలు చెబుతుంటే విన్నాం. ఇకపోతే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అయిన సంగతి తెలిసిందే.
ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు అప్పుడప్పుడు ఒకరి చేతిలో నుండి వేరొకరి చేతుల్లోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పటిదాకా అలా ఎన్నో సినిమాల విషయాలలో జరిగినట్లు స్వయంగా ఆయా దర్శకులు, నిర్మాతలు చెబుతుంటే విన్నాం. ఇకపోతే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అయిన సంగతి తెలిసిందే. టీ సిరీస్ తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ మూవీ నిర్మించనున్నారు. అయితే.. ఎలాంటి హడావిడి లేకుండా సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సినిమా అనేసరికి ఒక్కసారిగా ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయ్యారు.
ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి బన్నీ ఫ్యాన్స్ తో పాటు బన్నీ కూడా ఎక్సయిటింగ్ గా నెక్స్ట్ అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి.. అటు రణబీర్ తో యానిమల్ చేస్తూనే.. ప్రభాస్ తో స్పిరిట్ లైనప్ చేశాడు. ఇంతలో బన్నీతో కొత్త ప్రాజెక్ట్. అసలు వీరు కలిసి చర్చించుకున్నట్లు కూడా ఎప్పుడూ వార్తలు రాలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా కాంబినేషన్ లో సినిమా అంటే.. ఖచ్చితంగా సర్ప్రైజ్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం వీరి కాంబినేషన్ గురించి ఎంతో ఎక్సయిట్ అవుతున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి క్రేజీ వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అదేంటంటే.. సందీప్ రెడ్డి ఈ సినిమాని అల్లు అర్జున్ కంటే ముందు మహేష్ బాబుతో అనుకున్నాడట. కానీ.. మహేష్ బాబుకు కథ చెబితే ఓకే చేయకపోవడంతో.. ఆ కథని బన్నీకి చెప్పి ఓకే చేసుకున్నాడట సందీప్. సందీప్ చెప్పిన లైన్ కూడా బన్నీకి బాగా నచ్చిందట. దీంతో సూపర్ స్టార్ నో చెప్పిన కథతో ఇప్పుడు బన్నీ సినిమా చేస్తున్నాడంటూ రూమర్స్ కూడా మొదలైపోయాయి. ఇదిలా ఉండగా.. పుష్ప 2 షూటింగ్ పూర్తి కాగానే అల్లు అర్జున్ సందీప్ సినిమాని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. సందీప్ కంటే ముందు బన్నీ.. త్రివిక్రమ్ తో ఓ సినిమా ఓకే చేశాడని సినీ వర్గాల సమాచారం. మరి ముందుగా ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడో చూడాలి. మరోవైపు ప్రభాస్ తో సినిమా సంగతి సందీప్ ఏం చేశాడో అప్ డేట్ ఇస్తాడేమో వెయిట్ చేయాలి. మరి వీరి కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Brace yourselves for this massive collaboration between three powerhouses of India – Producer Bhushan Kumar, Director Sandeep Reddy Vanga and superstar Allu Arjun.@alluarjun @imvangasandeep #BhushanKumar #KrishanKumar @VangaPranay @VangaPictures #ShivChanana @NeerajKalyan_24 pic.twitter.com/xis8mWSGhl
— T-Series (@TSeries) March 3, 2023