తెలుగు బుల్లితెరపై అనేక మంది యాంకర్లు ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే స్టార్ యాంకర్లు దూసుకెళ్తున్నారు. తమదైన మాటలు, పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ల రేంజ్ లో కొందరు యాంకర్లకు క్రేజ్ ఉంది. అలా తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి ఒకరు. బుల్లితెర రాములమ్మగా ఈ అమ్మడు క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తుంది. అంతేకాక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. కొన్నాళ్ల క్రితం పద్దతిగా ఫొటో షూట్స్ ఇచ్చే మన బిగ్ బాస్ బ్యూటీ ఇటీవల కాస్తా గ్లామర్ డోస్ పెంచేసింది. ఇటీవల శ్రీముఖికి సంబంధించిన వార్తొకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటో.. అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎన్నో అద్భుతమైన టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, స్పెషల్ ఈవెంట్స్ కి శ్రీముఖి యాంకర్ గా చేసింది. ఇప్పుడు కూడా పలు ఛానళ్లలో వివిధ షోలు హోస్ట్ గా చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఇంక సినిమాల్లో కూడా అడపాదడపా కనిపిస్తూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి నటిస్తున్న విషయం తెలిసిందే. అవకాశాల విషయానికి వస్తే.. శ్రీముఖి చేతినిండా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంటోంది. ఇక ఆమె కెరీర్ విషయం అలా ఉంచితే.. వ్యక్తిగతం విషయంపై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది కూడా శ్రీముఖి పెళ్లి గురించే కావడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు.. శ్రీముఖి త్వరలో ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోనుందట.
కొంతకాలంగా ఆ వ్యాపారవేత్తతో ఈ బుల్లితెర రాములమ్మ ప్రేమలో ఉందంట. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. ఇటీవలే శ్రీముఖి, ఆమె కు కాబోయే వ్యక్తి కుటుంబ సభ్యులు కలుసుకుని మాట్లాడుకున్నారని, ఇక ఫైనల్ ప్రకటన మాత్రమే రావాల్సి ఉందనే వార్త ప్రచారంలో ఉంది. శ్రీముఖి పెళ్లి విషయంలో గతంలో కూడా ఇలాంటి వార్తలు అనేకం వచ్చాయని, ఇది కూడా అలాంటిదే అని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం శ్రీముఖి పెళ్లి వార్త గట్టిగానే నెట్టింటలో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి.. తన పెళ్లి వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ తన లైఫ్ ని తనకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో పాటు రీసెంట్ గా గోవా టూర్ వెళ్లి.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేసింది. బీచ్ ఇసుకలో టాప్ టు బాటమ్ అందాలన్నీ ఆరబోస్తూ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసింది. అయితే.. హీరోయిన్ గా ఛాన్సులు వస్తే వద్దనుకున్న శ్రీముఖి.. ఈ మధ్య హీరోయిన్స్ ని మించిన అందాల షో చేస్తుండటం విశేషం. అయితే శ్రీముఖి పెళ్లి విషయంపై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.