లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార..ప్రస్తుతం జవాన్, ఇరైవన్ సినిమాల్లో నటిస్తోంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గానే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో సోలో హీరోయిన్ గా కూడా తన సత్తా చాటుతోంది. ఇక ఇటీవల విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన నయనతార.. ఆ దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. కొన్నాళ్ళు హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేసి.. మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయారు. తాజాగా జరిగిన సంఘటనతో నయనతార అసంతృప్తిగా ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భర్తకు జరిగిన అవమాన భారంతో ఆ స్టార్ హీరోపై పగతో రగిలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అజిత్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆ మధ్య ఏకే 62 సినిమా అనౌన్స్ చేశారు. అజిత్, విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో సినిమాపై విపరీతంగా హోప్స్ కూడా పెట్టుకున్నారు. ఈ చిత్రానికి లైకా ప్రొడక్షన్స్ నిర్మించాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికే సినిమా సెట్స్ పైకి వెళ్ళేది. అయితే అయితే కథ నచ్చలేదని హీరో అజిత్, లైకా ప్రొడక్షన్స్ వారు విఘ్నేష్ శివన్ ను తొలగించారు. దీంతో విఘ్నేష్ శివన్.. తన ట్విట్టర్ బయో నుంచి అజిత్ సినిమాను తొలగించి.. ఆ స్థానంలో విక్కీ అని పెట్టారు. దీంతో విఘ్నేష్ శివన్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారని వార్తలు బయటకు వచ్చాయి. దీంతో తన భర్తకు అవమానం జరిగిందని నయనతార తెగ బాధ పడిపోతుందట. భర్తను తొలగించిన తర్వాత ఆమె నేరుగా అజిత్, నిర్మాతలతో మాట్లాడి సంధి కుదిర్చే ప్రయత్నం చేశారట.
అయినా గానీ ప్రయోజనం లేకపోవడంతో ఆమె పగతో రగిలిపోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపై అజిత్ సినిమాలోనూ, అలానే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుందట. పారితోషికం ఎక్కువ ఇచ్చినా సరే వాళ్లతో సినిమాలు చేయకూడదు అని ఆమె గట్టిగ ఫిక్స్ అయ్యారట. అజిత్, నయనతార ఈ ఇద్దరూ కలిసి బిల్లా, ఆరంభం, విశ్వాసం వంటి సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ పెయిర్. అయితే తన భర్తకు జరిగిన అవమానానికి ప్రతీకగా తాను అజిత్ సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.