Singer Sunitha: సింగర్ సునీత.. తెలుగు సినిమాను అభిమానించే వారికి పరిచయం అక్కర్లేని పేరది. తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 17 ఏళ్ల వయసులో ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె ఇప్పటివరకు 3వేలకు పైగా పాటలు పాడారు. సౌత్‌లోని అన్ని భాషల్లో పని చేశారు. 19 ఏళ్ల వయసులో కిరణ్‌కుమార్ గోపరాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే, కిరణ్‌తో మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత 2021లో ప్రముఖ వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, కుటుంబం అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు.
తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. శనివారం ఉదయం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. అందులోని ఓ ఫొటో ఆమె కడుపుతో ఉన్నదన్న రూమర్‌కు తెరతీసింది. ఆ ఫొటోలో సునీత మామిడి చెట్టు దగ్గర కూర్చుని ఓ మామిడి కాయను చేతిలో పట్టుకుని ఉన్నారు. సాధారణంగా కడుపుతో ఉన్న వాళ్లు పులుపు తినటానికి ఇష్టపడతారు కాబట్టి.. సునీత తాను ఇన్‌డైరక్ట్‌గా కడుపుతో ఉన్నానన్న సంగతి చెబుతోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఫొటోకు క్యాప్చన్‌గా ‘‘ బ్లెస్సెడ్’’ అని రాసి ఉండటంతో కొంతమంది నెటిజన్లు ఇది నిజమేనన్న కన్‌ఫర్‌మేషన్‌కు వచ్చేస్తున్నారు. అయితే, సింగర్ సునీత కానీ, ఆమె కుటుంబసభ్యులు కానీ, ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించలేదు. వారి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా, యాంకర్ శివజ్యోతి విషయంలోనూ సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లే షికార్లు చేశాయి. ప్రెగ్నెన్సీ పుకార్లపై శివజ్యోతే నేరుగా స్పందించారు. ఆ వార్తలను కొట్టిపరేశారు. అలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సింగర్ సునీత ప్రెగ్నెన్సీ వార్తల్లో కూడా నిజం ఎంతుందో తెలియాలంటే సునీత కానీ, ఆమె కుటుంసభ్యులు అధికారికంగా స్పందించాల్సిందే. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : చరణ్ కాబట్టి రిస్క్ తీసుకున్నాడు.. నేనైతే వద్దనే వాడ్ని: చిరంజీవి