సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం.. ఆ వెంటనే మరొకరితో పెళ్లికి రెడీ అయిపోవడం చాలా కామన్. బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు సెలబ్రిటీల డివోర్స్, రెండో పెళ్లిళ్ల గోల కంటిన్యూ అవుతోంది. అయితే.. తాజాగా మరో స్టార్ హీరో రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో కొత్త అమ్మాయితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లు.. సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఎప్పటి నుండో జరుగుతోంది. ముందుగా డేటింగ్ పేరుతో ఒకేచోట కలిసి ఉంటారు. కొంతకాలానికి ఇద్దరికీ నచ్చితే పెళ్లి వైపు అడుగులేస్తారు. లేదంటే ఎవరిదారి వారు చూసుకుంటారు. అయితే.. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్.. ఈ మధ్య సబా ఆజాద్ అనే థియేటర్ ఆర్టిస్ట్ తో చనువుగా కనిపిస్తున్నాడు. ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారు.. ఇటీవలే హృతిక్ ఫ్యామిలీ ఫోటోలో కూడా కనిపించింది సబా.
ప్రస్తుతం హృతిక్ వయసు 48. సబా వయసు 31.. ఇదివరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. అయితే.. ఇటీవలే హృతిక్ మాజీ భార్య సుసాన్.. వేరే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. మరి ఇంతకాలం సింగిల్ గా ఉన్న హృతిక్ తో సబా కనిపించేసరికి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి హృతిక్ – సబా గుడ్ న్యూస్ వినిపిస్తారేమో! ఇక హృతిక్ – సబాల జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.