ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా కలెక్షన్స్, క్రేజ్ విషయంలో ముందున్నాయి. బాలీవుడ్ లోనూ స్ట్రైట్ హిందీ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతూ ఔరా అనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ట్రిపులార్, కేజీఎఫ్ సినిమాలు అయితే ఒకదాన్ని మించి ఒకటి ఆడాయి. ట్రిపులార్ సినిమా 1,132 కోట్ల కలెక్ట్ చేసింది. తాజాగా కేజీఎఫ్ సినిమా అయితే ఏకంగా 1200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఆ విధంగా పాన్ ఇండియా స్థాయిలో సౌత్ సినిమాలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన విషయం తెలిసిందే. అలాగే ట్రిపులార్ సినిమాతో తారక్ పాన్ ఇండియా హీరోగా నిలిచిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి క్రేజీ కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ 31 మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు, అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఓ వార్త మాత్రం నెట్టింట ఫుల్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఈ వార్త బాగా వైరల్ గా మారింది. అయితే అది కీలక పాత్ర అని చెబుతున్నారు గానీ, సపోర్టింగ్ రోలా? లేక కమల్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తాడా అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఈ వార్తపై కూడా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కానీ, ఫిలిం వర్గాల్లో మాత్రం వీరిద్దరి కాంబోపై ప్రచారాలు బాగా జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. కాస్మొటిక్ సర్జరీ వికటించి నటి కన్నమూతఅయితే యాక్టింగ్ విషయంలో కమల్ హాసన్ ఎంత విలక్షణ నటుడో, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే విలక్షణ నటనతో ఆకట్టుకుంటాడు. ట్రిపులార్ సినిమాలో తారక్ నటవిశ్వరూపం చూసిన విషయం తెలిసిందే. అలాంటి ఓ క్రేజీ కాంబో అది కూడా ఎలివేషన్ కా బాప్ అని పేరు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా పడితే ఇంకేమైనా ఉందా.. అంటూ ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. వినడానికి ఇది చాలా బాగుంది కానీ, నిజమైతే ఇంకా బావుంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంక కమల్ హాసన్ సినిమాల విషయానికి వస్తే.. విక్రమ్ అనే సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. విక్రమ్ సినిమాలో కమల్ తో పాటు ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గ్యాగ్ వార్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన సాంగ్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కమల్ హాసన్- ఎన్టీఆర్ నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.