ఒక సినిమాని థియేటర్ లో చూసే ఆడియన్స్ ఎంతమంది ఐతే ఉన్నారో.. అంతకంటే ఎక్కువ మంది ఓటీటీలో చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమాని ఆల్రెడీ థియేటర్ లో చూసిన ప్రేక్షకులు.. సినిమా బాగుంటే మళ్ళీ ఓటీటీలో కూడా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ కంపెనీలు సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తం చెల్లించి మరీ సొంతం చేసుకుంటున్నాయి. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ హక్కుల ద్వారా లాభాలు గడించిన నిర్మాతలకి.. ఇప్పుడు ఈ ఓటీటీల ద్వారా కూడా మరిన్ని లాభాలు ఆర్జిస్తున్నారు. నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్న హీరో నాని నిర్మించిన హిట్ 2 సినిమాని ప్రముఖ ఓటీటీ కంపెనీ భారీ మొత్తం చెల్లించి స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన హిట్ ది సెకండ్ కేస్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అడివి శేష్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి నాని నిర్మాతగా వ్యవహరించగా.. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. హిట్ 1 తో లాభాలు అందుకున్న నాని.. ఇప్పుడు హిట్ 2 తో కూడా లాభాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సినిమా టాక్ బాగుండడంతో మరికొన్ని రోజుల పాటు కలెక్షన్లు బాగానే వస్తాయని ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఒక ప్రముఖ కంపెనీ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం.
హిట్ 2 మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు నెలల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్నట్లు సమాచారం. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన హిట్ 2 సినిమాకి 15 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా.. భారీ స్థాయిలో లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నానికి తక్కువ బడ్జెట్ లో జాక్ పాట్ కొట్టేశారన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే హిట్ 3లో నాని నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుందని సమాచారం. మరోవైపు నాని నటించిన దసరా సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.