తన నటనతో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరి మనసు దోచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ఇప్పటికే ఆమె పెళ్లి గురించి రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆమెను పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని, ఒత్తిడి మేరకు పెళ్ళికి అంగీకరించిందని, ఫ్యామిలీ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోబోతుందని, పెళ్లి చేసుకున్నాక సినిమాలు మానేస్తుందని ఇలా రకకరాల వార్తలు వచ్చాయి. తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటానని కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని ఇప్పటికే పలువురు హీరోయిన్లు, ఆర్టిస్టులు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. తాజాగా కీర్తి సురేష్ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ ఉందని తనకు తెలుసునని, తనతో పాటు నటిస్తున్న హీరోయిన్లు తనకి దీని గురించి చెప్పారని ఆమె వెల్లడించింది. అయితే క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం తన వరకూ రాలేదని, అది మనం ప్రవర్తించే తీరుని బట్టి ఉంటుందని ఆమె తెలిపింది. ఒకవేళ నిజంగా కమిట్మెంట్ అడిగితే.. సినిమాలు మానేసి వేరే ఉద్యోగం చేసుకుంటానని ఆమె వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో తనకు ఫుల్ క్లారిటీ ఉందని, అవకాశాల కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదని ఆమె వెల్లడించింది.
ప్రస్తుతం కీర్తి సురేష్.. నాని సరసన దసరా, మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాల్లో నటిస్తోంది. అలానే తమిళంలో జయం రవి సరసన సైరెన్ అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాదు.. హోంబలే ఫిల్మ్స్ తమిళంలో అడుగుపెట్టి చిత్రీకరిస్తున్న మొట్టమొదటి వెంచర్ లో కీర్తి సురేష్ నటిస్తోంది. కీర్తి సురేష్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే.. విప్లవం నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో వస్తున్న సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ లేడీ ఓరియెంటెడ్ మూవీ. మొత్తానికి కీర్తి సురేష్ మంచి ఛాన్స్ కొట్టేసింది.