మహేష్ బాబు, జగన్ కి కామన్ ఫ్యాన్స్ ఎక్కువ. మహేష్ బాబునే జగన్ గా ఊహించుకుంటూ ఉంటారు. అయితే జగన్ పథకాన్ని మహేష్ తన సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పథకం ఏంటి?
మహేష్ బాబు కుటుంబం వైసీపీ పార్టీతో మంచి అనుబంధం కలిగి ఉంది. సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. మహేష్ బాబు కూడా జగన్ అంటే అభిమానం. ఈ కారణంగా వైసీపీలో మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్ లో జగన్ కి, జగన్ ఫ్యాన్స్ లో మహేష్ బాబుకు ఇలా ఇద్దరిలో కామన్ ఫ్యాన్స్ ఉంటారు. బ్యానర్ లు కట్టాల్సి వచ్చినప్పుడు ఒకే బ్యానర్ లో జగన్, మహేష్ బాబుల ఫోటోలు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఒక వైపు జగన్ ఫోటో ఉంటే.. మరోవైపు మహేష్ బాబు ఫోటో ఉంటుంది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ సీఎంగా నటించారు. ఈ సినిమాలో మహేష్ పాత్రను సీఎం జగన్ రియల్ క్యారెక్టర్ తో పోలిక పెట్టుకుని మురిసిపోయారు.
ఆ సినిమాలో మహేష్ తీసుకునే విప్లవాత్మక నిర్ణయాలు అచ్చం సీఎం జగన్ తీసుకునే నిర్ణయాల్లాగా ఉన్నాయని ఇప్పటికీ అంటూ ఉంటారు. ఈ సినిమాలో డైలాగ్స్ ని ఇప్పటికీ జగన్ సహా ఇతర వైసీపీ నాయకుల కోసం వాడుకుంటారు. అది వైసీపీలో మహేష్ కి ఉన్న క్రేజ్. సర్కారు వారి పాట సినిమాలో కూడా జగన్ డైలాగ్ ని మహేష్ చెప్పడం వైసీపీ వర్గాల్లో జోష్ ని నింపింది. నేను విన్నాను, నేను ఉన్నాను అనే జగన్ డైలాగ్ నిజ జీవితంలో ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. ఇక ఇదే డైలాగ్ ను మహేష్ తన సినిమాలో వాడి జగన్, మహేష్ కామన్ ఫ్యాన్స్ కి విపరీతమైన కిక్ ఇచ్చారు. తాజాగా మహేష్ బాబు మరోసారి జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకోబోతున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ28వ సినిమా కోసం జగన్ పథకం పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ‘అ’ సెంటిమెంట్ ఎక్కువ. తన సినిమాలకు ఎక్కువగా అ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్సే ఉంటాయి. తీసిన 11 సినిమాల్లో 6 సినిమాలకు టైటిల్స్ అ తోనే మొదలయ్యాయంటే అర్ధం చేసుకోవచ్చు త్రివిక్రమ్ కి సెంటిమెంట్ ఏ రేంజ్ లో ఉందో అనేది. అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో ఇలా అ అనే అక్షరంతో మొదలయ్యాయి. తాజాగా మహేష్ తో తెరకెక్కిస్తున్న సినిమాకు కూడా అ అక్షరంతో మొదలయ్యే టైటిల్ ని పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ పథకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన అమ్మ ఒడి పేరును ఈ సినిమాకు పెట్టినట్లు సమాచారం.
అమ్మ సెంటిమెంట్ తో తెరకెకెక్కుతున్న ఈ సినిమాకి అమ్మ ఒడి అనే టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుందని ఈ పేరే ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఉగాది కానుకగా రేపు టైటిల్ ను రివీల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదట్లో అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ అనుకున్నారు. ఇప్పుడు అమ్మ ఒడి అయితే బాగుంటుందని ఈ టైటిల్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఈ వార్త వైసీపీ వర్గాల్లో విపరీతమైన జోష్ నింపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీన్ని వైసీపీ వారు సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. దీనిపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి చిత్ర యూనిట్ దీనిపై ప్రకటన ఇస్తేనే గానీ ఇది రూమరా? లేక నిజమా? అనేది తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.