తెలుగులో లేడీ పవర్ స్టార్ గా కితాబందుకున్న సాయి పల్లవి లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం “గార్గి”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేసి విడుదలై చేశారు. తమిళంలో సూర్య-జ్యోతిక సమర్పణలో రిలీజ్ కాగా, తెలుగులో రానా సమర్పణలో విడుదలైంది. విడుదలై తొలి రోజే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సాయిపల్లవి అభిమానులకు ఈ సినిమా ఓ రేంజ్ లో నచ్చింది. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. అప్పుడే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అనేక వార్తలు వినిపిస్తోన్నాయి.
సాయి పల్లవి రీసెంట్ గా విరాటపర్వం సినిమాతో పలకరించింది. ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మరోసారి గార్గి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరొక వైపు ఈ సినిమాకు సంబంధించి ఓటీటీలో విడుదలపై వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన సోలీ లివ్ గార్గి సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. ఇక థియేటర్లో విడుదలైన నాలుగు వారాల అనంతరం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కాస్త ముందుగా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. కానీ “గార్గి” చిత్ర యూనిట్ నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
ఇక సాయిపల్లవి విషయానికి వస్తే.. ఈ అమ్మడు ఒక్కోక్క సినిమాకు దాదాపు రెండు కోట్లు రూపాయలు తీసుకుంటున్నట్లు టాక్. అయితే ఈ మధ్య ఆమెకి సరైన హిట్ సినిమా పడలేదు. దీంతో సాయిపల్లవికి అవకాశాలు తగ్గుతున్నాయని కొంతమంది నెటిజన్ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయిపల్లవి టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తే ఆ ఆఫర్ల విషయంలో సాయిపల్లవి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా.. గార్గి మూవీని థియేటర్లో చూసి ప్రేక్షకులు త్వరలో ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు. మరి.. గార్గి మూవీ ఓటీటీలో వస్తుందన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rithu Chowdhary: పెళ్లి పీటలు ఎక్కబోతున్న జబర్దస్త్ రీతూ చౌదరి!
ఇదీ చదవండి: Nayanthara: నయనతార, విగ్నేష్ లకు ఊహించని షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్..!
ఇదీ చదవండి: వీడియో: మాస్ డ్యాన్స్ తో అదరగొట్టిన జబర్దస్త్ రోహిణి!