సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ. ఆ తర్వాత అంతరిక్షం, వి, మహాసముద్రం సినిమాల్లో నటించింది. తమిళంలో దుల్కర్ సల్మాన్ సరసన హే సైనామిక చిత్రంలో నటించిన ఈ బ్యూటీకి సరైన హిట్స్ లేక స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ లో పుట్టిన ఈ బ్యూటీ.. పెళ్లి వార్తలతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. యంగ్ హీరో సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ మహాసముద్రం సినిమా నుంచి క్లోజ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అదితిరావు హైదరీకి ఇదివరకే పెళ్లి అయ్యింది. సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్న అదితి.. కొంతకాలానికి విడాకులు ఇచ్చేసింది. ఇక సిద్దార్థ్ కి ఇది వరకే వివాహం జరిగింది. 2003లో మేఘన అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సిద్దార్థ్.. 2007లో విడాకులు ఇచ్చేసారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్న సిద్దార్థ్.. మహాసముద్రం సినిమాతో అదితి మాయలో పడ్డట్టు వార్తలు ప్రచారం జరిగింది. ఆ మధ్య ముంబైలోనే ఓ సెలూన్ వద్ద వీరిద్దరూ మీడియా కంట పడ్డారు. అన్ స్టాపబుల్ షోలో సిద్దార్థ్ డేటింగ్ లో ఉన్నట్లు హింట్ ఇచ్చారు శర్వానంద్. దీనికి తోడు శర్వానంద్ నిశ్చితార్థానికి వీరిద్దరూ జంటగా వచ్చారు.
ఇక అంతే నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయేది వీళ్ళే అంటూ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. అదితి, సిద్దార్థ్ లు పెళ్ళికి సిద్ధమవుతున్నారంటూ వార్తలు రాసుకొచ్చారు. ‘ఇద్దరం రిలేషన్ లో ఉన్న మాట నిజమే గానీ పెళ్లి మా ఇద్దరికీ కలిసి రాలేదు’ అంటూ సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు సమాచారం. మరి పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది సస్పెన్స్ గా సాగుతున్న నేపథ్యంలో.. పెళ్లి చేసుకుంటారంటూ వార్తలైతే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే వీరిపై వస్తున్న పెళ్లి రూమర్లను ఖండించడం లేదు. అలా అని పెళ్లిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు మాత్రం వస్తున్నాయి. మరి ఈ జంటపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.